ఏపీ మాజీ మంత్రి నారాయణకు బెయిల్ రద్దు..!
చిత్తూరు, త్రిశూల్ న్యూస్ :
టీడీపీ నేత, మాజీ మంత్రి నారాయణకు చిత్తూరు 9వ అదనపు జిల్లా కోర్టులో చుక్కెదురైంది. టెన్త్ పరీక్ష పత్రాల లీక్ కేసులో చిత్తూరు జిల్లా కోర్టు నారాయణ బెయిల్ రద్దు చేసింది. నవంబర్ 30 లోపు పోలీసులకు లొంగిపోవాలంటూ సోమవారం ఆదేశాలు జారీ చేసింది. పదో తరగతి ప్రశ్నాపత్రాలు లీకేజీ కేసులో మాజీమంత్రి నారాయణపై చిత్తూరు పోలీసులు కేసు నమోదు చేసి ఈ ఏడాది ఏప్రిల్‌లో అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. అయితే న్యాయస్థానం అయనకు బెయిల్ మంజూరు చేసింది. దీంతో కింది కోర్టు మంజూరు చేసిన బెయిల్‌ను రద్దు చేయాలని ప్రభుత్వం తరఫు న్యాయవాది చిత్తూరు కోర్టులో మరో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం నారాయణ బెయిల్ రద్దు చేస్తూ నవంబర్ 30వ తేదీ లోపల పోలీసుల ఎదుట లొంగిపోవాలని ఆదేశాలు జారీ చేసింది
Comments
Post a Comment