నిర్దిష్ట గడువులోపు సమస్యలను పరిష్కరించండి - ఇంచార్జ్ కమిషనర్ చెన్నుడు

నెల్లూరు, త్రిశూల్ న్యూస్ :
రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత ఆశయాలతో నిర్వహిస్తున్న స్పందన వేదికలో అందే ఫిర్యాదుల పరిష్కారంలో నగర పాలక సంస్థ అన్ని విభాగాల సిబ్బంది నిబద్ధత పాటించాలని, గడువులోపు సమస్యకు శాశ్వత పరిష్కారం అందించాలని ఇంచార్జ్ కమిషనర్ చెన్నుడు సూచించారు. కార్యాలయంలో సోమవారం జరిగిన స్పందన వేదికలో ముందుగా డయల్ యువర్ కమిషనర్ కార్యక్రమం ద్వారా ఉదయం 9.30 నుంచి 10.30 గంటల వరకు ప్రజల సమస్యలను ఫోన్ ద్వారా తెలుసుకుని సంబంధిత అధికారులకు ఇంచార్జ్ కమిషనర్ సూచనలు జారీచేశారు. అనంతరం ప్రజల నుంచి నేరుగా వినతి పత్రాలను స్వీకరించి గడువులోపు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రతీ విభాగం ఉన్నతాధికారి తమకు సంభందించిన ఫైళ్లు పెండింగులో లేకుండా జాగ్రత్తలు వహించాలని, సూచించిన గడువులోపు సమస్యలు పరిష్కారం కావాలని ఇంచార్జ్ కమిషనర్ స్పష్టం చేసారు. స్పందన వేదికలో 'డయల్ యువర్ కమిషనర్' ద్వారా 20, కార్యాలయం వేదికగా 28 విజ్ఞప్తులను అందుకున్నామని, గడువులోపు పరిష్కరించేందుకు కృషి చేస్తామని ఇంచార్జ్ కమిషనర్ తెలిపారు. స్పందన వేదికలో అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

వైసీపీ ప్రభుత్వం డేటా ఎంట్రీ ఆపరేటర్లను కూడా వేదనకు గురి చేసింది - పవన్ కళ్యాణ్

కడుపు మండిన ఉద్యోగులు.. రేపు వర్సిటి బంద్ కు పిలుపు..!

ద్రావిడ ఉద్యోగుల నిరసన భగ్నానికి రిజిస్టర్ యత్నం? - ద్రావిడ ఉద్యోగులు