పరిపాలనా వికేంద్రీకరణతోనే సీమ స్యశ్యశ్యామలం..!

- న్యాయ రాజధానితోనే సీమకు పూర్వ వైభవం

- మూడు రాజధానులకు మద్దతుగా పాణ్యంలో రాయలసీమ ఆత్మగౌరవ ర్యాలీ
పాణ్యం, త్రిశూల్ న్యూస్ :
శ్రీభాగ్ ఒప్పందం ప్రకారం కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటు చేస్తేనే రాయలసీమకు పూర్వవైభవం వస్తుందనీ, మూడు రాజధానులు ముద్దు - ఒకే రాజధాని వద్దు అనే నినాదంతో రాయలసీమ విద్యార్థి, యువజన సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో సోమవారం పాణ్యంలో రాయలసీమ ఆత్మగౌరవ పేరుతో ర్యాలీ నిర్వహించారు.
స్ధానిక పాణ్యం బస్టాండులో నాలుగురోడ్ల కూడలిలో మానవహారంగా ఏర్పడి మూడు రాజధానులు కావాలని పెద్ద ఎత్తున నినాదించారు.
ఈ సందర్బంగా రాయలసీమ విద్యార్ధి , యువజన సంఘాల జేఏసీ నేతలు రవీంద్రనాధ్ , బత్తిని ప్రతాప్ , వేణు మాధవరెడ్డి , కేజే. శ్రీనివాసరావు , బాలకృష్ణా నాయక్ తదితరులు మాట్లాడుతూ
తరతరాలుగా సీమకు జరుగుతున్న అన్యాయాన్ని ఇక సహించమనీ , పరిపాలనా వికేంద్రీకరణ - అభివృద్ది వికేంద్రీకరణ పేరుతో అన్ని ప్రాంతాలు అభివృద్ది చెందాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేస్తుంటే, దీనిని కొంత మంది కుట్రపూరితమైన ఆలోచనలతో కేవలం అవరావతి ప్రాంతమే రాజధానిగా ఉండాలనడం సిగ్గుచేటన్నారు. కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటుకు అన్ని పార్టీలు సహకరించాలని లేదంటే సీమలో అడుగడుగునా అడ్డుకుంటామన్నారు. కర్నూలులో న్యాయ రాజధాని కోసం పోరాటం మరింత ఉధృతం చేయనున్నట్లు జేఏసీ నేతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నేతలు, విద్యార్ధులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

వైసీపీ ప్రభుత్వం డేటా ఎంట్రీ ఆపరేటర్లను కూడా వేదనకు గురి చేసింది - పవన్ కళ్యాణ్

కడుపు మండిన ఉద్యోగులు.. రేపు వర్సిటి బంద్ కు పిలుపు..!

ద్రావిడ ఉద్యోగుల నిరసన భగ్నానికి రిజిస్టర్ యత్నం? - ద్రావిడ ఉద్యోగులు