అంగన్వాడి కేంద్రంపై వచ్చిన ఆరోపణలు అవాస్తవాలే..!

గంగవరం, త్రిశూల్ న్యూస్ :
చిత్తూరు జిల్లా గంగవరం మండలం కొత్తపల్లి పంచాయతీకి చేరిన కోనపరెడ్డిపల్లి అంగన్వాడి కేంద్రంపై వచ్చిన ఆరోపణల్లో అవాస్తవాలేనని ప్రజాసంఘాల నాయకులు పేర్కొన్నారు. అంగన్వాడి వర్కర్ మాకొద్దు అంటూ ఓ పత్రికలో, సిడిపిఓ కు ఇచ్చిన ఫిర్యాదులపై జాతీయ మానవ హక్కులు సంఘం, మాల మహానాడు, సిపిఐ, అంగన్వాడి యూనియన్ నాయకులు సోమవారం గ్రామాన్ని సందర్శించి జరిగిన విషయాలపై గ్రామస్తులు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ గ్రామంలో మినీ అంగన్వాడి వర్కర్ గా నాగరత్న విధుల్లో చేరినప్పటి నుండి కేంద్రం నిర్వహణలోనూ, ప్రభుత్వం నుండి అందుతున్న పౌష్టికాహారాన్ని అందించడంలో ఎక్కడ అవకతవకులు లేవని గ్రామస్తులు నిర్ధారించారని తెలిపారు. పలమనేర్ ఐసిడిఎస్ సిడిపిఓ, సూపర్వైజర్ రెండు పర్యాయాలు సందర్శించి, రికార్డులను సైతం పరిశీలించినా ఎటువంటి అవకతవకలు లేవని, అధికారుల సమక్షంలోనే గ్రామస్తులు పౌష్టికాహారం సమయానికి అందిస్తున్నారని లిఖితపూర్వకంగా సంతకాలు చేసి సమర్పించినా గిట్టని వారు అవాస్తవాలను, వాస్తవాలుగా చిత్రీకరించి ఆరోపించడం సరికాదన్నారు. గ్రామంలో ఇద్దరూ వ్యక్తులకు సంబంధించిన ఇంటి స్థల వివాదాన్ని పిల్లల భవిష్యత్తు కోసం అక్షరాలు నేర్పుతున్న అంగన్వాడి వర్కర్ పై బురద జల్లడం ఎంతవరకు సమంజసమని నిలదీశారు. గ్రామ సమస్యను గ్రామంలోనేచర్చించుకోవాలే తప్ప అవాస్తవాలతో వీధిన పడితే గ్రామం పరువు పోతుందని సూచించారు. కొంతమంది ఆదిపత్యం కోసం దళితుల మధ్య చిచ్చులు పెట్టి ఘర్షణలకు ప్రోత్సహిస్తారని అటువంటి వారి ఉచ్చులో పడకుండా దళితులందరూ అభివృద్ధి బాటలో నడవడానికి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జాతీయ మానవ హక్కులు జిల్లా అధ్యక్షులు డి వి మునిరతం, మాల మహానాడు రాష్ట్ర నాయకులు యమల సుదర్శన్, మానవ హక్కుల జిల్లా సహాయ కార్యదర్శి వేలయుధం, అంగన్వాడి యూనియన్ లీడర్ సరస్వతి, సిపిఐ నాయకులు చెన్నకేశవులు, సుబ్రహ్మణ్యం పార్థసారథి, రవికుమార్, గుండా మనోహర్, మోహన్ బాబు, తిప్పయ్య, తదితరులు పాల్గొన్నారు

Comments

Popular posts from this blog

వైసీపీ ప్రభుత్వం డేటా ఎంట్రీ ఆపరేటర్లను కూడా వేదనకు గురి చేసింది - పవన్ కళ్యాణ్

కడుపు మండిన ఉద్యోగులు.. రేపు వర్సిటి బంద్ కు పిలుపు..!

ద్రావిడ ఉద్యోగుల నిరసన భగ్నానికి రిజిస్టర్ యత్నం? - ద్రావిడ ఉద్యోగులు