ఇండోనేషియాలో భారీ భూకంపం..20మంది మృతి..!

ఇండోనేషియా, త్రిశూల్ న్యూస్ :
భారీ భూకంపం ఇండోనేసియాను కుదిపేసింది. ఈ ఘటనలో 20 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇండోనేసియాలో భారీ భూకంపం సంభవించింది. సుమారు 20 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికార వర్గాలు తెలిపాయి. సుమారు 300 మందికి గాయాలయ్యాయి. వందల సంఖ్యలో భవనాలు దెబ్బతిన్నాయి. పశ్చిమ జావా ప్రావిన్స్‌లోని సియాంజూర్ ప్రాంతంలో 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు యూఎస్‌ జియోలాజికల్‌ సర్వే వెల్లడించింది.

ఇస్లామిక్‌ బోర్డింగ్‌ స్కూల్‌, ఆస్పత్రి సహా అనేక భవనాలు దెబ్బతిన్నాయి. గ్రేటర్‌ జకార్తా ప్రాంతంలో భూకంప తీవ్రత ఎక్కువగా ఉందని అధికారులు తెలిపారు. ఎత్తైన భవనాల నుంచి ప్రజలను ఖాళీ చేయించారు. పెద్ద పెద్ద అపార్టుమెంట్లలో ఉన్న ప్రజలు భయంతో బయటకు పరుగులు తీశారు.

Comments

Popular posts from this blog

వైసీపీ ప్రభుత్వం డేటా ఎంట్రీ ఆపరేటర్లను కూడా వేదనకు గురి చేసింది - పవన్ కళ్యాణ్

కడుపు మండిన ఉద్యోగులు.. రేపు వర్సిటి బంద్ కు పిలుపు..!

ద్రావిడ ఉద్యోగుల నిరసన భగ్నానికి రిజిస్టర్ యత్నం? - ద్రావిడ ఉద్యోగులు