చిత్తూరు జిల్లాలో స్వల్ప భూకంపం..!

పలమనేరు, త్రిశూల్ న్యూస్ :
ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో పది సెకన్ల పాటు స్వల్పంగా భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనకు గురై ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ముఖ్యంగా పలమనేరు, గంటూరు, గంగవరం, కీలపట్ల, బండమీద జరావారిపల్లి, కూరపల్లి, గాంధీనగర్, నలసానిపల్లి తదితర ప్రాంతాల్లో భూమి కంపించగా.. 15 నిమిషాల వ్యవధిలో భారీ శబ్ధంతో భూమి మూడుసార్లు కంపించి వస్తువులు చెల్లాచెదురయ్యాయి. గోడలు కొంత దెబ్బతిన్నాయి. గతంలో జిల్లాలోని పలు ప్రాంతాల్లో భూప్రకంపనలు సంభవించాయి. ఆ సమయంలో భూమి కంపించడంతో ఈడిగపల్లి, చిలకవారిపల్లి, షికారు, గూడవారిపల్లిలో ఇళ్లకు పగుళ్లు వచ్చాయి. భయంతో గ్రామాలలో ప్రజలు రాత్రంతా రోడ్లపైనే గడిపారు. అయితే ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.

Comments

Popular posts from this blog

వైసీపీ ప్రభుత్వం డేటా ఎంట్రీ ఆపరేటర్లను కూడా వేదనకు గురి చేసింది - పవన్ కళ్యాణ్

కడుపు మండిన ఉద్యోగులు.. రేపు వర్సిటి బంద్ కు పిలుపు..!

ద్రావిడ ఉద్యోగుల నిరసన భగ్నానికి రిజిస్టర్ యత్నం? - ద్రావిడ ఉద్యోగులు