Trishul News

వర్షాకాలపు సమస్యలపై దృష్టి సారించండి - నెల్లూరు కమిషనర్ హరిత

నెల్లూరు, త్రిశూల్ న్యూస్ :
డ్రైను కాలువల్లో పూడికతీత పనులు, లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు నిల్వ ఉండకుండా తోడివేత పనులు, మురుగు పారుదల చర్యలు, దోమల వ్యాప్తి నిర్మూలన వంటి వివిధ చర్యలపై ప్రత్యేక దృష్టి సారించి, వర్షాకాలపు సమస్యలను పరిష్కారించాలని నగర పాలక సంస్థ కమిషనర్ హరిత అధికారులను సూచించారు. పారిశుద్ధ్య నిర్వహణ పనుల పర్యవేక్షణలో భాగంగా స్థానిక 49 వ డివిజన్ గుప్తా పార్క్, యనమల వారి వీధి, రామిరెడ్డి వీధి, జయలలిత నగర్, పాత మున్సిపల్ ఆఫీస్ తదితర ప్రాంతాల్లో బుధవారం ఉదయం అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానికంగా జరుగుతున్న పారిశుద్ధ్య పనులను కమిషనర్ పర్యవేక్షించి అధికారులు, సిబ్బందికి వివిధ సూచనలు జారీ చేశారు. వివిధ ప్రాంతాల్లో వర్షాలకు దెబ్బతిన్న రోడ్లకు అంచనాలు సిద్ధం చేసి, వెంటనే మరమ్మతు పనులు చేపట్టాలని ఆదేశించారు. డ్రైను కాలువల పూడికతీత సిల్టును ఎప్పటికప్పుడు తొలగించి పరిసరాలను శుభ్రంగా ఉంచాలని, పందుల బెడద లేకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారులను కమిషనర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో నగర పాలక సంస్థ ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ వెంకట రమణ, ఇంజనీరింగ్ విభాగం ఎస్.ఈ సంపత్ కుమార్, ఈ.ఈ చంద్రయ్య, శానిటరీ విభాగం సిబ్బంది, సచివాలయం కార్యదర్శులు పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post