Trishul News

లే అవుట్ రెగులేషన్ స్కీం పొడిగింపు - నెల్లూరు కమిషనర్ హరిత

నెల్లూరు, త్రిశూల్ న్యూస్ :
లే అవుట్ రెగులేషన్ స్కీం (ఎల్.ఆర్.ఎస్) గడువును 2023 వ సంవత్సరం జనవరి నెల 31వ తేదీ వరకు పొడిగించారని, అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని లే అవుట్ యజమానులకు నగర పాలక సంస్థ కమిషనర్ హరిత సూచించారు. నగర పాలక సంస్థ కార్యాలయం కౌన్సిల్ సమావేశ మందిరంలో సచివాలయ వార్డు ప్లానింగ్ రెగులేషన్ కార్యదర్శులతో సమీక్షా సమావేశాన్ని బుధవారం నిర్వహించారు. సమీక్షలో కమిషనర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం జీ.ఓ నెంబర్ 10 ద్వారా తేది 08-01-2020 ని అనుసరించి క్రమబద్ధీకరణకు అర్జీలు దాఖలు చేసిన లే అవుట్ యజమానులు, లే అవుట్ కు సంభందించిన పూర్తి ధ్రువీకరణ పత్రాలను కార్యాలయంలో సమర్పించి అనుమతులు పొందాలని సూచించారు. సచివాలయ వార్డు ప్లానింగ్, రెగులేషన్ కార్యదర్శులు తమ పరిధిలోని లే అవుట్లను గుర్తించి ఎల్.ఆర్.ఎస్ పై యజమానులకు అవగాహన కల్పించాలని సూచించారు. కార్యదర్శుల లాగిన్ లలో ఉన్న పెండింగ్ అప్లికేషన్ లను ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించి త్వరితగతిన పూర్తి చేయాలని కమిషనర్ ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో టౌన్ ప్లానింగ్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post