Trishul News

టిడ్కో గృహాలకు రుణాలు మంజూరు చేయించండి - కమిషనర్ హరిత

నెల్లూరు, త్రిశూల్ న్యూస్ :
నవరత్నాలు పధకంలో రాష్ట్ర ప్రభుత్వం పేదలందరికీ గృహాలు అందించే కార్యక్రమంలో భాగంగా నిర్మించిన టిడ్కో గృహాలకు బ్యాంకుల ద్వారా రుణాలు మంజూరు చేయించి, లబ్ధిదారులకు త్వరితగతిన కేటాయించాలని అధికారులను కమిషనర్ హరిత ఆదేశించారు. టిడ్కో గృహాల కేటాయింపు ప్రగతిపై మెప్మా, హౌసింగ్ అధికారులతో సమీక్షా సమావేశాన్ని కమిషనర్ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ అర్హులైన లబ్ధిదారులతో బ్యాంకు ఖాతాలు తెరిపించి, గృహ రుణాలను వేగవంతంగా మంజూరు చేయించాలని ఆదేశించారు. బ్యాంకులలో రుణాలు రిజెక్ట్ అయిన వారి వివరాలు సేకరించి తిరిగి రుణాలు మంజూరు చేసేందుకు కృషి చేయాలని కమిషనర్ సూచించారు. టిడ్కో గృహాలు మంజూరైనప్పటికీ స్వీకరించేందుకు ఆసక్తి చూపని లబ్ధిదారులతో ప్రత్యేకంగా మాట్లాడి గృహాలు కేటాయించేలా చూడాలని కమిషనర్ ఆదేశించారు. ఇతర ప్రాంతాల్లో తాత్కాలికంగా స్థిరపడిన గృహాల లబ్ధిదారులకు సమాచారం అందించి, రిజిస్ట్రేషన్ ప్రక్రియలో పాల్గొనేలా ప్రోత్సహించాలని సూచించారు. టిడ్కో గృహ సముదాయాల్లో మౌలిక సదుపాయాలు కల్పించి త్వరితగతిన లబ్ధిదారులకు అందుబాటులోకి తేవాలని అధికారులను కమిషనర్ సూచించారు. ఈ సమావేశంలో మెప్మా పి.డి రవీంద్ర బాబు, హౌసింగ్ ఈ.ఈ ఉమా శంకర్ శాస్త్రి, అధికారులు రామసుబ్బారావు, సిబ్బంది పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post