Trishul News

అమరావతి వద్దు.. మూడు రాజధానిలే ముద్దు - ఎమ్మెల్యే వెంకటే గౌడు

పలమనేరు, త్రిశూల్ న్యూస్ :
వికేంద్రీకరణకు మద్దతుగా ఏర్పాటు చేసిన జాయింట్‌ యాక్షన్‌ కమిటీ సమావేశం బుధవారం పలమనేరు జాతీయ రహదారి హోటల్ సరస్వతి కేఫ్ ఎదురుగా జరిగింది. ఈ సమావేశంలో పలమనేరు శాసన సభ్యులు ఎన్ .వెంకటే గౌడు మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు సమగ్రంగా అభివృద్ధి చెందాలన్న ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా మూడు రాజధానులు ఏర్పాటు చేయాలన్న సంకల్పానికి తిరుమల వెంకటరమణ స్వామి ఆశీర్వాదం కూడా తోడవ్వాలని కోరుతూ. మరోపక్క ఒక ప్రాంతం అభివృద్ధిని మాత్రమే కోరుకునే వారి మనసులు మార్చాలని వెంకటరమణ స్వామివారిని వేడుకుంటున్నానని అన్నారు. వికేంద్రీకరణకు మద్దతుగా స్వచ్ఛంద సంస్థలు, ప్రజా సంఘాలు, కలిసొచ్చే రాజకీయ పార్టీలను భాగస్వామ్యం చేసుకోవాలని ఆయన అన్నారు. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ మరోసారి ముక్కలయ్యేందుకు అవకాశం లేకుండా అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం వికేంద్రీకరణ భావనను మరింత బలంగా ప్రజలలోకి తీసుకెళ్ళాలి. ప్రత్యేకించి మీరు మండల పరిదిలో గల ఎంపిటిసిలను, సర్పంచులు లను పార్టీ ముఖ్య నేతలను మరియు అన్ని వర్గాల వారిని సమన్వయం చేసుకొని దేవాలయాల్లో పూజలు, పత్రిక సమావేశాలు జరిగేలా చూడాలని కోరుతున్నాను అని అన్నారు. మూడు రాజధానులతోనే రాష్ట్ర సమగ్ర అభివృద్ధి సాధ్యపడుతుందన్నారు. పలమనేరు ప్రజలందరూ రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా, స్వచ్ఛందంగా పాల్గొని వికేంద్రీకరణకు మద్దతు తెలపాలని కోరారు. జిల్లా జడ్పీ చైర్మన్ శ్రీనివాసులు(వాసు) మాట్లాడుతూ అమరావతి శంకుస్థాపనకు జగన్ కు ఆహ్వానం వస్తే ఆయన వెళ్ల లేదని గుర్తు చేశారు. ఈ విషయాన్ని ప్రజలు ఎన్నడూ మర్చిపోరని చెప్పారు. రాజధాని విషయంలో శివరామకృష్ణన్ కమిటీ చెప్పిన విషయాలకు కట్టుబడి ఉంటానని శాసనసభలో ఆనాడు జగన్ చెప్పారన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ హేమంత్ కుమార్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ పవిత్ర మురళీకృష్ణ, మండల కన్వీనర్ బాలాజీ నాయుడు, సర్పంచ్ సంగం మండలాధ్యక్షుడు విశ్వనాథ్ రెడ్డి, బైరెడ్డిపల్లి జడ్పిటిసి కేశవులు, నాయకులు రామచంద్రా, రంగనాథన్, స్థానిక సర్పంచ్ మరియు ఎంపిటిసిలు, తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post