Trishul News

నా పాదయాత్ర అడ్డుకునేందుకు కెసిఆర్ కుట్ర - షర్మిల

వరంగల్, త్రిశూల్ న్యూస్ :
వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సీఎం కేసీఆర్‌ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ఆమె ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ తన పాదయాత్రను అడ్డుకునేందుకు ముఖ్యమంత్రి కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. లా అండ్ ఆర్డర్ సమస్య సృష్టించి, తనను అరెస్ట్ చేయాలని చూస్తున్నారన్నారు. తాను బసచేసే బస్సుకు నిప్పు పెట్టారని, వాహనాలు ధ్వంసం చేశారని మండిపడ్డారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా పాదయాత్ర ఆపబోమని షర్మిల స్పష్టం చేశారు. కాగా షర్మిల చేస్తున్న పాదయాత్రలో పోలీసులు భారీగా మోహరించారు. ఆమెను ఏక్షణమైనా అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలియవచ్చింది. షర్మిల పాదయాత్రలో ముగ్గురు ఏసీపీలు, ఆరుగురు సీఐలు, పది మంది ఎస్ఐలు, 120 మంది కానిస్టేబుళ్లు ఉన్నారు. నిన్న (ఆదివారం) నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిపై షర్మిల వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో నర్సంపేటలో ఉద్రిక్తత నెలకొంది.

Post a Comment

Previous Post Next Post