Trishul News

ప్రకృతి వ్యవసాయంను ప్రోత్సహించే దిశగా చర్యలు చేపట్టండి - జడ్పీ చైర్మన్

- విత్తనాలు ఎరువులు ఆర్ బికేలలో అందుబాటులో ఉంచండి - జిల్లా కలెక్టర్  
చిత్తూరు, త్రిశూల్ న్యూస్ :
జిల్లాలో ప్రకృతి వ్యవసాయం సాగును మరింత ప్రోత్సహించే దిశగా చర్యలు చేపట్టాలని జెడ్పి చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా వ్యవసాయ సలహా మండలి సమావేశం జిల్లా సచివాలయంలోని సమావేశపు మందిరంలో నిర్వహించగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన జెడ్పి చైర్మన్ మాట్లాడుతూ జిల్లాలో ప్రకృతి వ్యవసాయం సాగును ప్రోత్సహించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. వేరుశనగ, చిరుధాన్యాల విత్తనాలను ప్రతి ఆర్బికేలలో అందుబాటులో ఉంచేలా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. జిల్లాలో నీరు పుష్కలంగా ఉందని, హార్టికల్చర్ పంటలు బాగా పండించడం జరుగుతోందని, దీనితో పాటు కాయగూరలు పండించడం మరియు చిరుధాన్యాల పంట సాగును ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేసేందుకు రైతులకు మరింత అవగాహన పెంచాలని సూచించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి రైతులకు అండగా నిలిచేందుకు అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడం జరుగుతున్నదని, లాభసాటి వ్యవసాయం చేసేందుకు అవసరమైన సలహాలు సూచనలను అందించేందుకు రైతు భరోసా కేంద్రాలను అందు బాటులోకి తీసుకురావడం జరిగిందని, ఈ కేంద్రాల ద్వారా అందించే సేవలు రైతులు సద్వినియోగం చేసుకునేలా కృషి చేయాలన్నారు.     
- విత్తనాలు ఎరువులు ఆర్ బికేలలో అందుబాటులో ఉంచండి - జిల్లా కలెక్టర్  

జిల్లా కలెక్టర్ యం. హరి నారాయణన్ మాట్లాడుతూ జిల్లాలో రబీ సాగు విస్తీర్ణం అన్ని పంటలతో కలిపి 48,746 హెక్టార్లు కలదని, ఇప్పటి వరకు 1,916 హెక్టార్లు సాగు అవుతున్నదని, గత సంవత్సరం ఇదే సమయానికి జిల్లాలో 834 హెక్టార్లలో సాగు కావడం జరిగిందని, ఈ సంవత్సరం రబీ సీజన్ ఆశాజనకంగా ఉన్నప్పటికీ సాగు విస్తీర్ణాన్ని పెంచాల్సిన అవసరం కలదని, ఇందుకు వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రైతులకు సాగుకు అవసరమైన విత్తనాలు, ఎరువులు రైతు భరోసా కేంద్రాలలో అందుబాటులో ఉండేలా తగు చర్యలు చేపట్టాలని రైతులు అధిక దిగుబడి సాధించేందుకు అవసరమైన నాణ్యమైన ఎరువులు, విత్తనాలు పంపిణీతో పాటు సస్య రక్షణ చర్యలపై రైతులకు అవగాహన మరింత పెంచాలన్నారు. ఈ విషయంలో రైతు భరోసా కేంద్రాలల్లోని వ్యవసాయ, ఉద్యాన, సెరికల్చర్ వెల్ఫేర్ అసిస్టెంట్లు క్షేత్ర స్థాయిలో మరింత కృషి చేయాలన్నారు. జిల్లాలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా పిఎం కిసాన్ - రైతు భరోసా మరియు క్రాప్ ఇన్సురెన్స్ లబ్ది పొందేoదుకు రైతులు విధిగా ఎంపిసిఐ లింకేజి ( ఈ - కె వై సి) చేయించుకోవాలని ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు రైతులు బ్యాంకులకు వెళ్లి వారి ఆధార్, బ్యాంకు ఖాతా వివరాలు, మొబైల్ నెంబర్ తో అనుసంధానం చేసుకోవాలని ఈ ప్రక్రియను పూర్తి చేసే విషయంలో రైతులకు ఆర్ బి కె ఇంచార్జ్ లు సహాయ సహకారాలు అందించాలని సూచించారు. జిల్లాలో గల మామిడి గుజ్జు పరిశ్రమలవివరాలను ప్రతి ఆర్బికే పరిధిలోప్రదర్శించేలా చర్యలు చేపట్టాలని జిల్లా ఉద్యానవన శాఖ అధికారిని కలెక్టర్ ఆదేశించారు. రైతులకుఅవసరమైన వర్మీ కంపోస్ట్ చెత్త నుండి సంపద తయారీ కేంద్రాలలో అవసరమైన మేరకు అందుబాటులోకలదని తెలిపారు.
డి ఆర్ ఓ ఎన్. రాజశేఖర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ రైతాంగానికి సత్వర సేవలు అందించేందుకు ఏర్పాటై న ఆర్ బి కె లు రైతులకు అవసరమైన సాంకేతిక సలహాలు సూచనలు అందివ్వాలన్నారు. 
జిల్లా వ్యవసాయ అధికారి మురళి కృష్ణ మాట్లాడుతూ గత జిల్లా వ్యవసాయ సలహా మండలి సమావేశంలో చర్చించిన అంశాలలో సభ్యులు తలెత్తిన అంశాల్లో భాగంగా గ్రామాలలో మామిడి సాగు చేయు రైతులకు ప్రకృతి వ్యవసాయ సాగు పై అవగాహన కల్పించాలని కోరడం జరిగిందని ఇందుకు గానూ ఆర్ వై ఎస్ ఎస్ గుంటూరు వారు చిత్తూరు జిల్లాలో మామిడి సాగు చేయు రైతులకు ప్రకృతి వ్యవసాయ సాగు చేసే అంశం పై అవగాహన కల్పించుటకు అంగీకరించడం జరిగిందని తెలుపగా, ఉద్యాన పంటల సాగులో తీసుకోవలసిన జాగ్రత్తల పై ఇది వరకే శిక్షణా కార్యక్రమాలను నిర్వహించడం జరిగిందని, సభ్యుల కోరిక మేరకు మరలా శిక్షణా కార్యక్రమాలు నిర్వహించుటకు చర్యలు తీసుకుంటామని జిల్లా ఉద్యాన శాఖాధికారి మధుసూదన్ రెడ్డి సభలో వివరించడం జరిగింది. ఈ సమావేశం లో పలమనేరు, కుప్పం, మదనపల్లి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ వెంకటరెడ్డి యాదవ్, ఇరిగేషన్ ఎస్ ఈ విజయ కుమార్ రెడ్డి, ఏపీ సీడ్స్ జిల్లా మేనేజర్ సంపత్ కుమార్, పశుసంవర్ధక శాఖ అధికారి వెంకటరావు, లీడ్ బ్యాంక్ మేనేజర్ శేషగిరిరావు, మార్కెటింగ్ ఎడి పరమేశ్వర్, ఫిషరీస్ డిడి రవికుమార్ రెడ్డి, జిల్లా సిరికల్చర్ అధికారి శోభారాణి, జిల్లా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డి ఎం మోహన్ బాబు, జిల్లా వ్యవసాయ సలహా మండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post