Trishul News

వ్యర్ధాల రీసైక్లింగ్ ద్వారా సంపద సృష్టి - కమిషనర్ అనుపమ

తిరుపతి, త్రిశూల్ న్యూస్ :
సమాజంలో పనికిరాని వ్యర్థాల ద్వారా సంపద సృష్టించడం జరుగుతున్నదని తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ అనుపమ అంజలి అన్నారు. స్కాచ్ అవార్డుల కేటగిరికి సంబందించి శుక్రవారం దేశంలోని ఎంపిక కాబడిన ప్రధాన నగరాల నుండి వర్చువల్ విధానంలో స్కాచ్ అవార్డుల సెలక్షన్ కమిటితో జరిగిన సమావేశంలో అనుపమ అంజలి తన ప్రజెంటేషన్ గురించి వివరిస్తూ ఇంటిగ్రేటెడ్ సాలీడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ పెసిలిటి కేటగిరిలో తమ తిరుపతి కార్పొరేషన్ నామినేషన్ వేయడాన్ని వివరిస్తూ తడి, పొడి వ్యర్థాల ప్రాససింగ్ చేయడం ద్వారా వస్తున్న ప్రయోజనాలను వివరించారు. ఇండ్ల వద్ద నుండే తడి పొడి చెత్తను విడదీసి సేకరించి ప్లాంట్ కు తరలిస్తున్నామని, అక్కడ తడి చెత్తను ఎరువులుగా మార్చి వ్యవసాయదారులకు తక్కువ ధరతో అందించడం జరుగుతున్నదని, పొడి చెత్తలోని ప్లాస్టిక్ ను సిమెంట్ ప్యాక్టరీలకు అమ్ముతున్నట్లు, భవన వ్యర్ధాలను రోడ్ సైడ్ వేసే టైల్స్, రోడ్ల నిర్మాణాలకు, గుంతలు పూడ్చేందుకు ఉపయోగిస్తున్నట్లు, అదేవిధంగా మురికినీటి అనేక దశల్లో శుద్ది చేసి ప్యాక్టరీలకు ఆ నీటిని అమ్మడం జరుగుతున్నదన్నారు. బయో గ్యాస్ ను కూడా ఉత్పత్తి చేయడం జరుగుతున్నదని దృశ్య రూపంలో కమిషనర్ అనుపమ వివరించారు. వ్యర్థాలు పేరుకుపోయి జన జీవనానికి ఏమాత్రం అడ్డంకి కాకుండా దాదాపు అన్ని వ్యర్ధాలను రీ సైక్లింగ్ చేయడం జరుగుతున్నదన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ చంద్రమౌళీశ్వర్ రెడ్డి, ఏయికామ్ టీమ్ లీడర్ భాలాజీ సింగ్ థాకూర్ పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post