ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షురాలిగా పిటి. ఉష..!
- పరుగుల రాణి పీటీ ఉషకు అరుదైన గౌరవం..
న్యూడిల్లీ, త్రిశూల్ న్యూస్ :
కేరళలో బలం పెంచుకోవడంపై ఫోకస్ పెట్టిన బీజేపీ.. ఆ రాష్ట్రానికి చెందిన పీటీ ఉషను 2022 జులై ఆరంభంలో రాష్ట్రపతి ద్వారా రాజ్యసభకు నామినేట్ చేసింది. తాజాగా ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షురాలిగా ఆమె నామినేషన్ దాఖలు చేశారు. అంతేకాదు ఆమె ఏకగ్రీవంగా ఆ పదవికి ఎన్నిక కాబోతున్నారు. 95 ఏళ్ల ఐఓఏ చరిత్రలో ఓ మహిళ ఈ బాధ్యతలను చేపట్టబోతుండటం ఇదే తొలిసారి కావడం గమనార్హం. పరుగుల రాణి పీటీ ఉషకు అరుదైన గౌరవం దక్కింది. ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షురాలిగా ఆమె బాధ్యతలు చేపట్టనున్నారు. 95 ఏళ్ల ఐఓఏ చరిత్రలో ఓ మహిళ అధ్యక్ష పదవిని చేపట్టనుండటం ఇదే తొలిసారి కావడం విశేషం. జాతీయ ఒలింపిక్ సంఘం హెడ్‌గా వ్యవహరించనున్న తొలి ఒలింపియన్, అంతర్జాతీయ పతకాలు సాధించిన క్రీడాకారిణిగానూ ఉష రికార్డ్ క్రియేట్ చేయనున్నారు. ఐఓఏ అధ్యక్ష పదవికి డిసెంబర్ 10 ఎన్నికలు జరగనుండగా.. 58 ఏళ్ల ఉష మాత్రమే నామినేషన్ దాఖలు చేశారు. శుక్ర, శనివారాల్లో అధ్యక్ష పదవి కోసం ఎవరూ నామినేషన్ దాఖలు చేయలేదని రిట్నరింగ్ ఆఫీసర్ ఉమేశ్ సిన్హా తెలిపారు. ఆఫీస్ బేరర్ల పోస్టుల కోసం శనివారం 24 నామినేషన్లు దాఖలయ్యాయన్నారు. దీంతో ఉషనే ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు. మేరీ కోమ్ నాయకత్వంలోని ఐఓఏ అథ్లెటిక్స్ కమిషన్ ఎంపిక చేసిన 8 మంది ‘స్పోర్స్‌పర్సన్స్ ఆఫ్ ఔట్‌స్టాండింగ్ మెరిట్’లో ఉష ఒకరు కావడం గమనార్హం. లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్‌లో సెకన్లో వందో వంతు తేడాతో కాంస్య పతకం గెలిచే అవకాశాన్ని కోల్పోయిన ఉష.. ఐఓఏ అధ్యక్షురాలిగా ఏకీగ్రీవంగా ఎన్నిక కానుండటం పట్ల బీజేపీ సీనియర్ నేతలు ఆమెకు ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షురాలిగా ఎన్నికవుతున్న సందర్భంగా.. దిగ్గజ గోల్డెన్ గర్ల్, శ్రీమతి పీటీ ఉషకు అభినందనలు. ప్రఖ్యాత ఐఓఏ ఆఫీస్ బేరర్లుగా ఎన్నిక అవుతున్న మన దేశ క్రీడా హీరోలకు కూడా అభినందనలు. దేశం వాళ్లను చూసి గర్విస్తోంది’ అని క్రీడా శాఖ మంత్రి కిరణ్ రిజిజు ట్వీట్ చేశారు.
Comments
Post a Comment