మహిళల్లో విద్యా చైతన్యం తెచ్చింది మహాత్మ జ్యోతిరావు పూలే - ఎన్ఇపి
- న్యూ ఇండియా పార్టీ రాష్ట్ర కన్వీనర్ జనగామ తిరుపతి
రామగుండం, త్రిశూల్ న్యూస్ :
మహాత్మ జ్యోతిరావు పూలే మహిళ లో విద్యా చైతన్యం తెచ్చిన వారి సామాజిక దృక్పథం చాలా గొప్పది అని న్యూ ఇండియా పార్టీ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ జనగామ తిరుపతి అన్నారు . మహాత్మ జ్యోతిరావు పూలే 133వ వర్ధంతిని పురస్కరించుకొని సోమవారం ఎన్ టిపిసి అన్నపూర్ణ కాలనీలో జరిగిన పూలే వర్ధంతి సభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై పూలే చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించి మాట్లాడారు.
మహాత్మా జ్యోతిరావు ఫూలే 11 ఏప్రిల్ 1827 జన్మించి 28 నవంబర్ 1890 న తుది శ్వాస విడిచారు అని అన్నారు. ఒక గొప్ప భారతీయ సామాజిక కార్యకర్త, ఆలోచనాపరుడు, కుల వ్యతిరేక సంఘ సంస్కర్త మరియు మహారాష్ట్రకు చెందిన రచయిత అని అంటరానితనం మరియు కుల వ్యవస్థ నిర్మూలన కోసం పని చేశారు అని మరియు మహిళలు అణగారిన ప్రజలను విద్యావంతులను చేయడంలో అతని ప్రయత్నo మన్నతమైనది అని కొనియాడారు. మరియు వారి భార్య అయిన సావిత్రీబాయి ఫూలే భారతదేశంలో స్త్రీల విద్యకు మార్గదర్శకులు అని గుర్తు చేశారు.వారు అనుచరులతో కలిసి సత్యశోధక్ సమాజ్ ను స్థాపించి అట్టడుగు కులాల ప్రజలకు సమాన హక్కులు సాధించాడు అని, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసిన ఆ సంఘంలో అన్ని మతాలు, కులాల వారు భాగస్వాములను చేసి. మహారాష్ట్రలో సామాజిక సంస్కరణ ఉద్యమంలో ఫూలే ఒక ముఖ్యమైన వ్యక్తిగా పరిగణించబడ్డాడు అన్నారు. 1888లో మహారాష్ట్ర సామాజిక కార్యకర్త విఠల్‌రావు కృష్ణాజీ వందేకర్‌చే గౌరవప్రదమైన మహాత్మ పూజ్యనీయ బిరుదును ప్రదానం చేశాడు అని తెలిపారు.
డా. బిఆర్ అంబేద్కర్ గారిని కూడ వారి ఆలోచనా విధానం ప్రభావితం చేసింది అన్నారు. అణగారిన కులాలు, మహిళలు చాలా కష్టాల్లో ఉన్నారని విద్య వారి విముక్తికి చాలా ముఖ్యమైనదని అతను గ్రహించాడు. ఈ క్రమంలో ఫూలే మొదట తన భార్య సావిత్రీబాయికి చదువు నేర్పించారు అని తెలిపారు. ఫూలేలు మహర్ మాంగ్ వంటి అంటరాని కులాల పిల్లల కోసం పాఠశాలలను ప్రారంభించారు అని అన్నారు. అసమానతను ప్రోత్సహించే సాంఘిక దురాచారాలన్నింటినీ వ్యతిరేకించారని వితంతు పునర్వివాహాన్ని ప్రోత్సహించారు అని న్యూ ఇండియా పార్టీ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ జనగామ తిరుపతి కొనియాడారు. ఈ కార్యక్రమంలో న్యూ ఇండియా పార్టీ నాయకులు నందం నాగవర్ధన్ రావు, అంజలి, కనకలక్ష్మి, విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment