పూలే దంపతులకు నివాళులు అర్పించిన కమిషనర్ హరిత..!
నెల్లూరు, త్రిశూల్ న్యూస్ :
ప్రముఖ సంఘ సంస్కర్తలైన మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతిని పురస్కరించుకుని పూలే దంపతుల విగ్రహాలకు నగర పాలక సంస్థ కమిషనర్ హరిత సోమవారం పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ దేశంలోని నిమ్న వర్గాల ప్రజలకు అందరితో సమాన హక్కులు కల్పించేందుకు పూలే దంపతులు ఎనలేని కృషి చేశారని కొనియాడారు. మహిళల విద్యకోసం వారు అమలుచేసిన విధానాలతో సమాజంలో చైతన్యం పెరిగిందని కమిషనర్ వెల్లడించారు. ప్రతీ ఏటా పూలే దంపతుల సంఘ సేవలను గుర్తుచేసుకోవడం ప్రతిఒక్కరి బాధ్యత అని వివరించారు.
Comments
Post a Comment