Trishul News

బారతీయ నారీ శక్తికి నిలువెత్తు రూపం ఝాన్సి లక్ష్మీ బాయి - ఎన్ పి ఐ

- గోదావరిఖనిలో ఘనంగా ఝాన్సి లక్ష్మీ బాయి 195వ జయంతి వేడుకలు
గోదావరిఖని, త్రిశూల్ న్యూస్ :
బారతీయ నారీ శక్తికి నిలువెత్తు రూపం ఝాన్సి లక్ష్మీ బాయి అని న్యూ ఇండియా పార్టీ అధ్యక్షులు డా.జె వి రాజు,  ఉపాధ్యక్షలు మాదరబోయిన నర్సయ్య, వేముల అశోక్, గంట బబిత సోని, తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ జనగామ తిరుపతి అన్నారు. శనివారం గోదావరిఖనిలోని న్యూ ఇండియా పార్టీ కార్యాలయంలో ఝాన్సి లక్ష్మీ బాయి 195వ జయంతి వేడుకలు న్యూ ఇండియా పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు గంట బబిత సోని ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ.. ఒక పక్క ధీరత్వం మరో పక్క మాతృత్వం రెండు కలబోసిన ఉత్తేజం ఆమెది అని కొనియాడారు. అస్తిత్వం కొరకు చివరి రక్తం బొట్టు వరకు పోరాడి వీర మరణం పొందిన వనిత లక్ష్మీ భాయి అని అన్నారు. ఆమె 1828వ సంవత్సరం నవంబర్ నెల 19న మహారాష్ట్రలోని సతార అనే ప్రాంతంలో జన్మించారు అని ఆమె అసలు పేరు మనికర్ణిక అని తెలిపారు. ప్రధమ భారత స్వాతంత్ర్య సంగ్రామంలో తన వీర పరాక్రమంతో బ్రిటీష్ వారిని గడ గడ లాడించి దేశ వాసులలో స్వాతంత్ర్య కాంక్ష రగిలించి భరతమాత దాస్య శ్రుంకలాలను విముక్తి చేసే ధ్యేయంతో తన ప్రాణాలను తృణప్రాయంగా సమర్పించిన వీర నారి ఝాన్సి అని కొనియాడారు. తను బ్రతికింది 29 సంవత్సరాలే కాని జనం గుండెల్లో చిరస్మరనీయం, నేటి తరంకి అమే ఆదర్శం అని అన్నారు. ఆంగ్లేయులు సైతం ఆమె పట్టుదల దైర్య సాహసాలను మెచ్చి ఆమెను 19వ శతాబ్దపు గొప్ప సాధికార గల మహిళగ అత్యంత అరుదైన ప్రభావశీలి మహిళగా అభివర్ణించారు. ఒకానొక సమయంలో అకస్మాత్తుగా ఆంగ్లేయులు చేసిన దాడిని తిప్పికొట్టే క్రమంలో తీవ్రంగా గాయపడి 1858 జూన్ 17 న వీరమరణం పొందారని స్మరించుకున్నారు.

Post a Comment

Previous Post Next Post