Trishul News

డి ఆడిక్షన్ సెంటర్ ను తనిఖీ చేసిన కమిషనర్..!

తిరుపతి, త్రిశూల్ న్యూస్ :
మత్తు వ్యసనపరుల మార్పుకై స్థానిక కెనడి నగర్ లో ఏర్పాటు చేసిన మత్తు పదార్థాల వ్యసన నిర్మూలన కేంద్రం (డి ఆడిక్షన్ సెంటర్) ను నగరపాలక సంస్థ కమిషనర్ అనుపమ అంజలి మంగళవారం తనిఖీ చేశారు. ఎంత మందికి కౌన్సెలింగ్ ఇస్తున్నారు, ఎంతమంది డాక్టర్లు ఉన్నారు, వ్యసనపరులను ఏ విధంగా గుర్తిస్తున్నారు, ఏ మందులు వాడుతున్నారని అడిగి తెలుసుకున్నారు. ఒక డాక్టర్, ఇద్దరు కౌన్సిలర్లు ఉన్నారని, డి ఆడిక్షన్ సెంటర్ ఆధ్వర్యంలో నగరంలోని పలు చోట్ల అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని హెల్త్ ఆఫీసర్ డాక్టర్ హరికృష్ణ తెలిపారు. ఈ సెంటర్ కు ప్రత్యేకంగా ఒక టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేయాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు. అలాగే మరిన్ని ఎక్కువ క్యాంపులు నిర్వహించి ప్రజల్లో చైతన్యం తీసుకురావాలన్నారు. ఏ మందులు ఇస్తున్నారు, ఎంతమందికి కౌన్సెలింగ్ ఇస్తున్నారు అనే విషయాలు రికార్డ్ చేసి పెట్టాలన్నారు. ఏ ఏ మందులు కావాలని ఒక లెటర్ ఇస్తే పై అధికారులకు పంపి తెప్పించుకుందామన్నారు. ఈ సెంటర్ ద్వారా ఎంతో మంది వెలుగులు నింపేలా అందరూ కృషి చేయాలన్నారు. కమిషనర్ వెంట డాక్టర్ ఆషా, కౌన్సిలర్లు షకిల, పవన్ తదితరులు ఉన్నారు.

Post a Comment

Previous Post Next Post