మహిళలపై దాడులను.. హత్యలను అరికట్టండి - ఎన్ఐపి
- న్యూ ఇండియా పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు గంట బబిత సోని పిలుపు
హైదరాబాద్, త్రిశూల్ న్యూస్ :
మహిళలపై దాడులు, హత్యలు హత్యాచారాలు రాష్ట్రంలో దేశంలో అధికంగా జరుగుతున్నాయి అని న్యూ ఇండియా పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు గంట బబిత సోని మండి పడ్డారు. ఇటీవలనే దేశరాజధానిలో ఆఫ్టాబ్ శ్రద్ద అనే యువతిని ఆమె ప్రియుడు అమీన్ పూనావాలా అనె మనిషి రూపంలో ఉన్న క్రూర మృగం అతి కిరాతకంగా హత్య చేసి చంపడాన్ని గంట బబిత సోని తీవ్రంగా ఖండించారు. శ్రద్దాను హత్య చేసి మృతదేహాన్ని 35 ముక్కలు చేసిన అమీన్ పూనావాలాకు ఉరిశిక్ష వేయాలని న్యూ ఇండియా పార్టీ పక్షాన డిమాండ్ చేశారు. సహజీవనంలో ఉంటున్న శ్రద్ధ పెళ్లిపై ఒత్తిడి తెచ్చినందుకే కోపంతో అఫ్తాబ్ శ్రద్ధను గొంతుకోసి చంపినట్లు తెలిపారు. ప్రస్తుత సమాజంలో మహిళలకు రక్షణ కరువైంది అని అన్నారు. మహిళలు బయట ఇంట్లో నమ్మిన మనుషుల దగ్గర కూడా అభద్రతా భావంతో ఉండవలసి రావడం దురదృష్టకరం అని ఆవేదన వ్యక్తంచేశారు. ఇలాంటి సంఘటనలు పునరావృత్తం కాకుండా చూడాలి అని కోరారు. మహిళా లోకం దైర్యంగా ఉండాలి అని ఇలాంటి చర్యలు ఎదురైనప్పుడు ప్రతిగంటించాలి అని న్యూ ఇండియా పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు గంటా బబిత సోని, ఎన్ఐపి మహిళా నాయకురాలు న్యాయవాది ఇరికిల్లా హేమా ప్రియదర్శిని, కాసిపేట రంజిత పిలుపునిచ్చారు.
Comments
Post a Comment