Trishul News

రాహుల్‌ గాంధీని చంపుతామంటూ బెదిరింపు లేఖ..?

- యాత్రలో చేరిన మహాత్మా గాంధీ ముని మనవడు
మహారాష్ట్ర, త్రిశూల్ న్యూస్ :
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర సందర్భంగా ఆయనను చంపుతామంటూ బెదిరింపు లేఖ ప్రత్యక్షమైంది. మహారాష్ట్రలో పర్యటన ముగించుకుబోతున్న రాహుల్ మధ్య ప్రదేశ్ చేరుకోనున్నారు. రాహుల్ అక్కడికి అడుగుపెట్టక ముందే ఆయనకు ఒక బెదిరింపు లేఖ ప్రత్యక్షమైంది. మధ్య ప్రదేశ్ రాజధాని ఇండోర్‌, జుని పోలీస్ స్టేషన్‌ పరిధిలోని ఒక స్వీట్ షాపు వద్ద ఈ లేఖ కనిపించింది. ఈ లేఖలో రాహుల్ ఇండోర్ వచ్చిన వెంటనే వీలైనంత త్వరగా ఆయనను చంపుతామని పేర్కొన్నారు. దీంతో ఈ అంశంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. లేఖ ఎవరు అక్కడికి చేర్చారు అనేదానిపై దర్యాప్తు చేస్తున్నారు. సీసీ టీవీ కెమెరా ఫుటేజ్ పరిశీలిస్తున్నారు. మరోవైపు ఈ యాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. ఈ యాత్రలో శుక్రవారం ఉదయం మహాత్మా గాంధీ ముని మనవడు తుషార్ గాంధీ రాహుల్ గాంధీని కలిశారు. బుల్దానా జిల్లాలోని షెగావ్ ప్రాంతంలో యాత్ర సాగుతుండగా, తుషార్ గాంధీ రాహుల్‌ను కలిశారు. ఆయనతో కలిసి పాదయాత్ర చేశారు. ఈ అంశంపై తుషార్ గాంధీ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. నేను భారత్ జోడో యాత్రలో చేరుతున్నాను. షెగావ్ నేను పుట్టిన ప్రాంతం. మా అమ్మ ఈ ప్రాంతం నుంచి రైలులో వెళ్తుండగా, షెగావ్ స్టేషన్‌లో ఆగినప్పుడు 17 జనవరి 1960న ఇక్కడే జన్మించాను అని తుషార్ గాంధీ తన పోస్టులో పేర్కొన్నారు. మరోవైపు రాహుల్ గాంధీ-తుషార్ గాంధీ కలయికను కాంగ్రెస్ పార్టీ చారిత్రాత్మకమైన సంఘటనగా అభివర్ణించింది.

Post a Comment

Previous Post Next Post