2023 సంవత్సరంలో మీ జాతకం ఎలా ఉండబోతుంది..!
త్రిశూల్ న్యూస్ డెస్క్ :
2023 సంవత్సరంలో జాతకం ఎలా ఉండబోతోంది..? పూర్తి వివరాలు పాఠకులు కోసం.
మేషం రాశి
2023 సంవత్సరం ఆరంభంలో మేషరాశి వారు చాలా దృఢమైన, బలమైన సంకల్పంతో ఉంటారు.మీరు మాటల్లో కటువుగా మాట్లాడటం నివారించండి. ఎందుకంటే సంవత్సరం ప్రారంభంలో, మీ మాటతీరు కారణంగా, కొన్ని చక్కని అవకాశాలు మీ చేతుల్లో నుండి జారిపోవచ్చు. నిరంకుశంగా ఉంటారు అన్న ముద్రను మీ మీద వేసుకోవడం కన్నా, తప్పు మరియు ఒప్పుల మధ్య తేడాను తెలుసుకుని, తెలివిగా ముందుకు సాగడం మేలు. అప్పుడే మీరు ఈ ఏడాది అభివృద్ధి చెందే ప్రయోజనాలు దక్కించుకుంటారు. ఈ ఏడాది మీరు మతపరంగా చాలా కచ్చితంగా మరింత ముందుకు వెళ్లే అవకాశాలున్నాయి. ఇలా మీరు మతపరమైన విషయాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలలో చాలా చురుగ్గా ఉండడంతో పాటు, ఆనందం కూడా పొందుతారు. ఇందులో భాగంగా మీరు ఒక ఎన్జీవోలో చేరడం ద్వారా, ఒక గుడికి విరాళం ఇవ్వడం కానీ, లేదా ఏదైనా సామాజిక సేవ చేయడం కానీ చేస్తారు. ఏడాది ప్రారంభంలో, సూర్యుడు మరియు బుధుడు మీకు తొమ్మిదవ స్థానంలో ఉండే అవకాశం ఉంది. దీని కారణంగా మీ తండ్రితో మీ సంబంధం మెరుగుపడుతుంది. ఆయన నుంచి మీరు కొన్ని పెద్ద ప్రయోజనాలను పొందుతారు. ఇక మార్చి నుండి మే మధ్య కాలం మీకు అనుకూలంగా ఉంటుంది. కానీ మే నుండి జూలై వరకు ఉన్న కాలం కాస్తంత ఒడిదొడుకులకు గురికావచ్చు. ఈ సమయంలో కుటుంబ జీవితంలో కొద్దిగా అనిశ్చితి ఏర్పడే అవకాశం ఉంది. మీ తల్లి గారి ఆరోగ్యం క్షీణించవచ్చు. ఈ సమయంలో మీరు పెద్ద ఆస్తిని కొనుగోలు చేయడం వల్ల ప్రయోజనం పొందుతారు. రియల్ ఎస్టేట్‌కు సంబంధించిన విషయాలలో మీరు మంచి విజయం సాధించే అవకాశాలున్నాయి. ఆగష్టు మరియు అక్టోబరు మధ్య, మీ రాశిచక్రానికి అధిపతి అయిన కుజుడు ఆరో స్థానంలో ఉండే అవకాశముంది. ఈ ప్రభావంతో మీరు న్యాయపరమైన విషయాలలో పూర్తి విజయాన్ని పొందవచ్చు మరియు కోర్టు కేసుల ఫలితాలు కూడా మీకు అనుకూలంగా ఉంటాయి. ఈ సమయంలో, మీరు మీ ప్రత్యర్థులను దీటుగా ఎదుర్కొనగలరు. ఈ కాలం మిమ్మల్ని మరింత శక్తిమంతులుగా చేసే అవకాశముంది. అయినప్పటికీ ఈ కాలంలో మీరు చేసే పనిలో కొన్ని ఒడిదొడుకులు ఎదురయ్యే అవకాశం ఉన్నందున నవంబర్, డిసెంబర్ నెలల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండటం అవసరం. మీరు ఏదో ఒక అవార్డును పొందే అవకాశం ఉంది. ఇక ప్రయాణాలకు సంవత్సరం ప్రారంభం అనుకూలంగా ఉంది.
వృషభ రాశి
వృషభ రాశి వారికి 2023 ఆరంభంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మీ రాశిచక్రంలో కుజుడు ప్రభావం వల్ల. మీ స్వభావంలో కాస్తంత కోపం కనిపిస్తుంది. ఇది మీకు కొంత ఇబ్బందిని కూడా కలిగించే అవకాశముంది. దీంతో పాటు మీరు కాస్తంత మానసిక ఒత్తిడికి కూడా లోనయ్యే అవకాశం ఉంది. కానీ క్రమంగా పరిస్థితులు మెరుగుపడతాయి. ఆపై మీరు మీ జీవితంలో ముందుకు సాగిపోవచ్చు. ఈ ఏడాది మీ ఆర్థిక పరిస్థితి ఒడిదొడుకుల్ని దాటేస్తుంది. దీంతో మీరు ఒక వైపు ఆర్థికంగా అద్భుతమైన ఫలితాలను పొందుతారు, ఇంకా మీ ఆదాయం కూడా పెరుగుతూనే ఉండవచ్చు. మరోవైపు, మీ సుదీర్ఘమైన ఖర్చుల జాబితా సంవత్సరంలో చివరి రెండు నెలల వరకు కొనసాగే అవకాశముంది. అవసరం లేకపోయినా మీరు ఖర్చు పెట్టాల్సి రావచ్చు. నవంబర్ డిసెంబర్ నెలల్లో మీరు మీ ముఖంలో చిరునవ్వుతో ఉంటారు. మీరు మరింత దృఢంగా మారేందుకు అవకాశముంది. ఈ సంవత్సరం మీరు మీ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టవలసి ఉంటుంది. లేకపోతే, మీరు అనారోగ్యానికి గురై ఆసుపత్రికి వెళ్లే ప్రమాదముంది. మీరు ఈ ఏడాది దూర ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. మీరు విదేశాలకు వెళ్లే అవకాశాన్ని కూడా దక్కించుకుంటారు. అంతేకాదు మీరు అక్కడ మీరు ఎక్కువ కాలం నివాసం ఉండేందుకు కూడా అవకాశం ఉంది. అంతే కాదు మీరు ఈ ఏడాది మరింత దూర ప్రాంతాలకు వెళ్లే పరిస్థితులున్నాయి. దీంతో పాటు, మీరు ఈ సంవత్సరం చాలా ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. ఏడాది మొదట్లో మీరు కాస్త ఎక్కువగా ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. మీరు స్వతహాగా కష్టపడి పనిచేస్తున్నప్పటికీ, ఈ ఏడాది మాత్రం మీరు కాస్తంత కష్టపడాల్సి వస్తుంది. ఈ సమయంలో మీరు మీకు జరిగేవి ఏవీ పట్టించుకోకపోవచ్చు. దీని కారణంగా, మీరు శారీరకంగా అలసిపోవడం వంటి వాటి వల్ల ఇబ్బంది పడొచ్చు. ఈ పరిస్థితులన్నీ మీరు ఒక్కసారి బేరిజు వేసుకుని చూస్తే, ఈ ఏడాది మీకు మంచి స్థితిని తీసుకొస్తుంది. ఎందుకంటే మీరు పని కారణంగా కుటుంబ సభ్యులకు కాస్త దూరంగా ఉండాల్సి రావడం, ఇంకా వారికి కాస్త తక్కువ సమయం కేటాయించాల్సి రావచ్చు. మీరు మీ కుటుంబ సభ్యులతో చక్కని సంబంధాల్ని కలిగి ఉండండి.
మిథున రాశి
2023 సంవత్సరం మిధునరాశి వారికి చాలా కొత్త విషయాలతో నిండి ఉంటుంది. జనవరి నెల నుంచి మీ అదృష్టం బలపడుతుంది, అంతేకాదు అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది. ఆగిపోయిన మీ పనులన్నీ పూర్తి కావడం ప్రారంభిస్తాయి. దీంతో మీరు ఆర్థికంగా కూడా అభివృద్ధి చెందుతారు. మీ కుటుంబ జీవితం ఈ ఏడాది చాలా బాగుంటుంది. మీ కుటుంబంలో జరిగే ఏదైనా శుభకార్యం మీ కుటుంబం మొత్తంలో ఐక్యతను, ప్రేమ భావనను పెంచుతుంది. ఏడాది ప్రారంభంలో, అంగారకుడు మీ వైవాహిక జీవితాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉంది. ఫలితంగా మీకు ఖర్చులు కూడా పెరుగుతాయి, కాబట్టి మీరు శాశ్వత ఆదాయ వనరులను కనుగొనడానికి ప్రయత్నించండి. ఈ ఏడాది ప్రారంభంలో మీరు విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. కొందరు మాత్రం ఒక రాష్ట్రం నుండి మరొక రాష్ట్రానికి చాలా తరచుగా ప్రయాణిస్తారు. ఈ సంవత్సరం మధ్యలో మీరు చాలా ప్రయాణం చేయాల్సి రావచ్చు. మీకు ఏదైనా కోర్టు కేసు నడుస్తుంటే, దాని ఫలితం ఈ ఏడాది వస్తుంది. ఈ సమయంలో కొన్ని ఇబ్బందులు తెరపైకి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి జనవరి నెలలో కొంత సంయమనం పాటించి, దానిని విడిచిపెట్టండి. ఆ తర్వాత కోర్టుకు సంబంధించిన వ్యవహారాల్లో మీకు కాలం కలసి వస్తుంది. మీ ఆరోగ్యం గురించి ఏ మాత్రం అజాగ్రత్తగా ఉండకండి, లేకుంటే మీరు ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది. ఏడాది ప్రారంభంలో మీకు మీ స్నేహితుల నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. మీరు ఏదైనా వ్యాపారం చేస్తే, వారి సహాయం చాలా ఉపయోగపడుతుంది. దీని వల్ల మీరు మీ వ్యాపారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లగలుగుతారు. మీ విశ్వాసం తార స్థాయిలో ఉంటుంది. దీని వల్ల మీరు క్లిష్టమైన సవాళ్లను కూడా ఎదుర్కోగలుగుతారు. మీరు మీ పెద్ద తోబుట్టువులతో కాస్త మంచి సంబంధాలు కొనసాగించడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఈ ఏడాది మీ ఇద్దరి మధ్య కాస్త మనస్పర్థలు వచ్చే అవకాశముంది.
కర్కాటక రాశి
2023 కర్కాటక రాశి వారికి అనుకూలంగా ఉండే సంవత్సరం. ఈ ఏడాది ప్రారంభం నుంచి మీకు అదృష్టం తోడుగా ఉంటుంది. దీని వల్ల మీ పనులు చాలా వరకు పూర్తి కావచ్చు. ఆగిపోయిన మీ కొన్ని పనులు కూడా పూర్తి కావచ్చు, అంతేకాదు.. ఈ ఏడాది మీ చిరకాల కోరికలు కూడా నెరవేరడం మొదలవుతుంది. ఈ ఏడాది మీరు చాలా ప్రయాణాలు చేసే అవకాశముంది. ఇందులో తీర్థయాత్రలకు కూడా వెళ్లే అవకాశం రావచ్చు. ఈ తీర్థ యాత్రలు మీకు మనశ్శాంతిని కలిగిస్తాయి. మతపరమైన విషయాలలో మీకు భక్తి విశ్వాసాలు పెరిగే అవకాశముంది. మీరు ఇలాంటి అంశాల్లో చురుకుగా పాల్గొంటారు. దీని వల్ల మీ గౌరవం కూడా పెరుగుతుంది. సమాజంలో మంచి పనులు చేసే ఏదైనా సంస్థలో మీరు చేరే అవకాశం ఉంది. దీనితో మీరు కొన్ని కొత్త పని చేయడానికి అవకాశం పొందవచ్చు. దీనివల్ల మీ సామాజిక స్థితి పెరుగుతుంది. ఈ ఏడాది విదేశాలకు వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయి. ఒకవేళ ఇందుకోసం మీరు ఇంకా దరఖాస్తు చేసుకోకుంటే, త్వరగా ఆ పని పూర్తి చేయండి. ఎందుకంటే మీరు విజయం సాధించవచ్చు. ప్రస్తుతం, మీ ఆదాయం బాగా ఉండొచ్చు. ఇంకా మీ విశ్వాసం కూడా బలంగా ఉండవచ్చు. దీని కారణంగా, మీరు కొన్ని కొత్త పనుల్ని చేపట్టడంతో పాటు, అందులో విజయం సాధించే అవకాశాలున్నాయి. కుటుంబ జీవితంలో కొద్దిగా అసంతృప్తి ఉండొచ్చు. కుటుంబంతో కలసి ఉంటునప్పుడు కూడా మీరు ఒంటరిగా ఫీలయ్యే అవకాశాలున్నాయి. మీరు వారితో దూరంగా ఉన్నట్లు అనిపించవచ్చు. కుటుంబంతో మీరు ప్రేమతో కలసిపోయే అవకాశాలు తక్కువగా ఉండొచ్చు. అంటే మీరు ఇంటికి కేవలం ఫార్మాల్టీగా వస్తున్నట్లుగా ఉంటారు. ఇలా విచిత్రంగా ఉండే మీ ప్రవర్తన మీ ఇంట్లోని వ్యక్తులకు ఇబ్బంది కలిగించే అవకాశముంది. వాళ్లు ఈ విషయంపై మీకు ఫిర్యాదు కూడా చేసే అవకాశముంది. ఈ రాశి వారికి ప్రభుత్వ రంగంతో కూడా మంచి పరిచయాలు ఏర్పడవచ్చు. మీరు కొంతమంది స్నేహితుల మద్దతును పొందే అవకాశం ఉంది, మీ పనిలో ముందుకు సాగడానికి వారు మీకు సహాయపడతారు. అంతేకాదు.. వారు మీ కుటుంబ విషయాలలో కూడా మద్దతునిస్తారు.
సింహా రాశి
సింహ రాశి వారికి ఇది చాలా కొత్త విషయాలతో నిండిన సంవత్సరం. ఏడాది మొదటి నుంచి మీ ఆత్మ విశ్వాస స్థాయి మెరుగ్గా ఉంటుంది. దేవునిపై మీ విశ్వాసం పెరుగుతుంది మరియు మీరు మతపరమైన కార్యక్రమాలలో కూడా పాల్గొనవచ్చు. ఈ సంవత్సరం మొత్తంలో, మీరు కొన్ని మతపరమైన కార్యక్రమాలను కూడా నిర్వహించవచ్చు, దీని వలన సమాజంలో మీ కీర్తి పెరిగే అవకాశం ఉంది మరియు అనేక మంది ప్రముఖులను కలిసే అవకాశం మీకు లభిస్తుంది. కొంతమంది ప్రముఖ వ్యక్తులతో కూడా పరిచయాలు ఏర్పడతాయి. దీని కారణంగా మీరు రాబోయే కాలంలో మంచి ప్రయోజనాలు పొందుతారు. ఈ ఏడాది పెట్టుబడికి మీకు అనుకూలంగా ఉంటుంది, ఈ పెట్టుబడి నుంచి మీరు మంచి రాబడిని కూడా పొందవచ్చు, అయితే ఈ విషయంలో ఇంట్రాడే కన్నా దీర్ఘకాలిక పెట్టుబడి మరింత లాభాలను తెచ్చిపెడుతుంది. కాబట్టి అలాంటి వాటిపైన మాత్రమే మీ దృష్టిని కేంద్రీకరించండి. సంవత్సరం ప్రారంభంలో, మీరు సుదీర్ఘ ప్రయాణానికి వెళ్ళవచ్చు. మీరు మీ దగ్గరి వ్యక్తులు, ప్రియమైన వారిని కలిసేందుకు వెళ్లవచ్చు. ఇది మీకు నూతన శక్తిని ఇస్తుంది. దీంతో మీరు జీవితంలోని అన్ని సమస్యలను మరచిపోయి మీ పనిపై దృష్టి పెట్టగలుగుతారు. ఈ ఏడాది మీకు ప్రయాణించే అవకాశాలు చాలా ఎక్కువగా వస్తాయి. వాటిలో కొన్ని దూర ప్రయాణాలు, ముఖ్యంగా విదేశీ ప్రయాణాలు ఉండవచ్చు. ఈ సంవత్సరం మీరు ఆరోగ్యం విషయంలో కొంచెం ఇబ్బందులు ఎదురుకావచ్చు. కాబట్టి మీరు మీ ఆరోగ్యం పట్ల పూర్తి శ్రద్ధ వహించాలి. చిన్న సమస్యలు కూడా పెద్దవయ్యే ప్రమాదముంది. కాబట్టి మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి. మీరు మీ వ్యక్తిగత వస్త్రధారణపై దృష్టి పెట్టండి, ఇందుకోసం మీరే స్వయంగా షాపింగ్ చేసుకోండి. సంవత్సరం మధ్యలో, మీరు షాపింగ్ చేసేందుకు మీకు గొప్ప అవకాశాలు దక్కుతాయి. కొన్ని ఖరీదైన వస్తువులు డిస్కౌంట్‌లో మీ ముందుకు వచ్చినప్పుడు మీరు వాటిని కొనుగోలు చేసే అవకాశముంది. ఈ సంవత్సరం, మీ చిరకాల కోరికలు కొన్ని నెరవేరే అవకాశం ఉంది, దీని వల్ల మీ ఆనందానికి అవధులు లేకుండా ఉంటుంది.
కన్యరాశి
కన్యారాశి వారికి 2023లో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఈ సంవత్సరం మీరు మీ కుటుంబం గురించి కాస్త ఎక్కువగా ఆందోళన చెందుతారు. మీ కుటుంబ వాతావరణాన్ని పాడు చేసే ఇలాంటి కొన్ని సంగతులు ఉండవచ్చు. మీ ప్రవర్తన ప్రజల అవగాహనకు అందనంత స్థాయిలో ఉంటుంది. మీరు ఏమి చెప్పాలనుకుంటున్నారో, మీరేం చేయాలనుకుంటున్నారో వారు అర్థం చేసుకోలేరు. మీ మాటలు, చేతల మధ్య వ్యత్యాసం ఉండొచ్చు. దాని కారణంగా మీ కుటుంబ సంబంధాలు కొద్దిగా క్షీణించవచ్చు. కాబట్టి మీరు వీటన్నింటి మీదా శ్రద్ధ పెట్టాల్సి రావచ్చు. ఈ ఏడాది ఆస్తికి సంబంధించిన విషయాలలో మీకు విజయం దక్కే అవకాశాలున్నాయి. ఈ ఏడాది మీరు పెద్ద ఆస్తిని కొనుగోలు చేయడంలో విజయం సాధించవచ్చు. ఏడాది మధ్యలో జీవిత భాగస్వామి సహాయంతో పెద్ద వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశాలు కూడా మీకు దక్కుతాయి. అత్తమామలతో కొద్దిపాటి వివాదాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి, ఏడాది మొదట్లో చాలా సాఫీగా, ఓపిగ్గా ఉండేందుకు ప్రయత్నించండి. మీకు ఈ ఏడాదిలో ఏప్రిల్ నెల ప్రయాణాలకు అనుకూలంగా ఉంది. ఆ తర్వాత అక్టోబరు నుండి నవంబరు నెలల్లో ప్రయాణం మీకు అనుకూలంగా ఉంది. ఈ సమయంలో చేసే ప్రయాణం నుండి మీరు ఆనందాన్ని పొందుతారు. ఏడాది మొదటి నుంచి మీకు స్నేహితుల మద్దతు దక్కుతుంది. ఏడాది మొదట్లో ప్రభుత్వం నుండి కొన్ని మంచి ప్రయోజనాలు కూడా అందుకోవచ్చు. కన్య రాశి వారు తమ తండ్రితో మంచి సంబంధాన్ని కొనసాగించేందుకు ప్రయత్నించండి. ఎందుకంటే ఈ ఏడాది రాశి ఫలాల దృష్ట్యా మీకు తక్కువ సంబంధాలు నెరిపే అవకాశముంది. ప్రస్తుతం మీరు మీ ఆరోగ్యం పట్ల కాస్తంత ఉదాసీనంగా వ్యవహరిస్తున్నా, తర్వాత మాత్రం జాగ్రత్త వహించండి. ఈ ఏడాది మీకు విజయం దక్కవచ్చు. మీ మనస్సులో సరికొత్త ఆలోచనలు వచ్చే అవకాశం ఉంది, దాని కారణంగా మీరు మీ బిజినెస్‌ని మరింత ముందుకు తీసుకెళ్లగలరు. ఉద్యోగస్తులు ఈ ఏడాది బిజినెస్ లోకి మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కానీ ప్రస్తుతానికి మాత్రం మీరు మీ ఉద్యోగాన్ని కొనసాగించడం మంచిదని సలహా. ఒకవేల మీరు బిజినెస్ చేయాలని అనుకుంటే,,, ఉద్యోగం చేస్తూనే, సైడ్ బిజినెస్ చేయడానికి ప్రయత్నించండి.
తులరాశి
2023 తులారాశి వారికి మంచి శుభవార్తతో ప్రారంభమవుతుంది. మీరు మీ వృత్తి జీవితంలో స్థిరపడేందుకు, మీ ప్రణాళికల్ని విలువైన నిర్ణయాలుగా మార్చుకునే అవకాశం దక్కుతుంది. మీరు కొత్త బిజినెస్ ప్రారంభించాలని అనుకుంటే, ఈ ఏడాది మీకు ముందుకు సాగేందుకు పూర్తి అవకాశం దక్కుతుంది. మీరు మీ కుటుంబ జీవితంలో ఆనందాన్ని పొందుతారు. వృత్తిరీత్యా బిజీగా ఉన్నప్పటికీ, మీరు మీ కుటుంబానికి పూర్తి సమయం కేటాయిస్తారు. మీ ఫ్యామిలీ ప్రతి మంచి చెడ్డల విషయంలోనూ మీరు వారికి అండగా ఉంటారు. దీని వల్ల మీ కుటుంబంతో మీ బంధం మరింత బలోపేతం అవుతుంది. కుటుంబంలో మీకు నచ్చిన వారి మద్దతు దక్కించుకోవడం ద్వారా మీ విశ్వాసం కూడా పెరుగుతుంది. ఏడాది ప్రారంభంలో మీ అమ్మగారి ఆరోగ్యం కాస్త ఒడిదొడుకులకు లోనయ్యే అవకాశముంది. ప్రయాణాల విషయానికి వస్తే, ఈ ఏడాది మీరు మధ్యస్థ దూర ప్రయాణాలు ఎక్కువగా చేసే అవకాశముంది. ఈ ఏడాది మీరు కాస్తంత మీ ఊబకాయం పట్ల శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆహారంలో పోషకాలు లేకపోవడం, ఇంకా కొవ్వు పదార్ధాల ప్రభావం వల్ల మీ శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగి, మీకు ఊబకాయం మరింత పెంచే అవకాశాలున్నాయి. మీకు న్యాయ రంగంలో తగినంత అవగాహన ఉంటే, ఈ ఏడాది మీరు విజయ శిఖరాలను చేరుకోవచ్చు. మీకు ఈ ఏడాది స్నేహితుల మద్దతు పూర్తిగా ఉంటుంది. మీరు మీకు అవసరమైన సందర్భాల్లో అండగా నిలబడతారు. కొత్త రంగాల్లో మీరు ప్రవేశించాలని మీరు భావించవచ్చు. ఈ ఏడాది మీ మనసులోని భావోద్వేగాలను బాగా అదుపులో పెట్టుకోవచ్చు. జీవితానికి సమతుల ప్రాముఖ్యత ఇస్తారు. ఈ క్రమంలో మీరు చాలాసార్లు మీకు మీరే అన్యాయం చేసుకోవచ్చు. దీని ప్రభావం వల్ల మీ ఆరోగ్యం కూడా నిర్లక్ష్యానికి గురి కావచ్చు. ఫలితంగా తీవ్ర పరిణామాలు ఎదురయ్యే అవకాశం ఉంది, కాబట్టి ఈ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఈ ఏడాది మీకు స్థానచలన అవకాశాలున్నాయి. అంతేకాదు.. ఈ ఏడాది మీరు ఏదైనా ఆస్తి కొనుగోలు చేస్తారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది.
వృశ్చిక రాశి
వృశ్చికరాశి వారికి 2023 చాలా అనుకూలమైన సంవత్సరం. ఈ ఏడాది మీ ఆత్మవిశ్వాసం పెరిగే అవకాశముంది. అంతే కాదు. ఈ ఏడాది మీరు ఏదైనా కొత్తగా చేయాలన్న కోరిక మీ మనసులో ఏర్పడే అవకాశముంది. మీరు ఈ ఏడాది రెండు విషయాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులో మొదటిది ఎక్కువగా కోపం తెచ్చుకోకుండా ఉండండి, ఎందుకంటే మీ ముఖ్యమైన పనులు కూడా దీని వల్ల చిక్కుల్లో పడి ఆగిపోయే ప్రమాదయముంది. ఇక రెండోది మీ ఆలోచనలను ఇతరులతో పంచుకోవడం మానుకోండి. ఎందుకంటే మీ ఆలోచనలతో ఇతరులు ఎక్కువగా ప్రయోజనం పొందే అవకాశముంది. ఈ ఏడాది మీ ప్రత్యర్థులు కొంత వరకు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. దాని వల్ల మీరు మానసిక ఒత్తిడికి లోనవుతారు. అయినప్పటికీ మీరు చింతించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వారు ఎంత ప్రయత్నించినా, వారు మీకు వ్యతిరేకంగా ఏ పని కూడా చేయలేరు. చివరకు మీరే విజయం సాధిస్తారు. కోర్టుకు సంబంధించిన వ్యవహారాల్లో కూడా మీరు విజయం సాధించవచ్చు. ఇక మీరు ఉద్యోగంలో కూడా మంచి స్థానాన్ని పొందుతారు. ఈ ఏడాది మీరు అనసవరమైన ఖర్చులపై కాస్త దృష్టి పెట్టండి. లేకపోతే... ఇది మీ ఆర్థిక పరిస్థితి మీద తీవ్రమైన ఒత్తిడిని కలిగిస్తుంది. మీకు ఆగిపోయిన పనులన్నీ కుటుంబంలో పెద్దల ఆశీర్వాదంతో పూర్తవుతాయి. వాటి వల్ల మీరు ఆర్థిక ప్రయోజనాలు పొందడంతో పాటు, సమాజంలో మీకు మంచి గౌరవం కూడా దక్కుతుంది. ఈ ఏడాది మీరు కొన్ని దూర ప్రయాణాలు కూడా చేయాల్సి వస్తుంది. అది మీ భవిష్యత్తుకు చాలా ముఖ్యమైన విషయంగా మారుతుంది. ఈ సంవత్సరం మీరు విదేశాలకు వెళ్లే అవకాశం కూడా ఉంది. ఇంట్లో కొన్ని మంచి పనులు కూడా జరగవచ్చు, దాని కారణంగా కుటుంబ వాతావరణం చాలా సహనంగా, శాంతియుతంగా మారుతుంది. మీరు ఏదైనా కొత్త విషయం నేర్చుకోవాలనే కోరిక పుడుతుంది, దాని కారణంగా మీరు కొత్తదాన్ని అధ్యయనం చేసే ప్రయత్నం చేయవచ్చు. మీరు ఆ అవకాశాల్ని అందుకోవడం ఆనందంగా అనిపించవచ్చు. మీరు జీవితంలో ముందుకు సాగే అవకాశాన్ని కూడా పొందుతారు.
ధనుస్సు రాశి
ధనుస్సు రాశి వారికి 2023 ఎన్నో అనుకూలతలను తీసుకొస్తుంది. మీరు జీవితంలోని చాలా రంగాల్లో విజయం సాధిస్తారు. ఈ విజయాలతో మీ విశ్వాసం అత్యున్నత స్థాయికి చేరుకుంటుంది. అయితే ఇది మీకు అహంకారంగా మారకుండా జాగ్రత్త పడుతూ, మీ పనులు చక్కగా నిర్వర్తించండి. ఇలా చేయడం వల్ల మీరు ఈ ఏడాదిలో ఇతర రంగాలలో పేరుతో పాటు సంపదను కూడా దక్కించుకుంటారు. మీకు కొన్ని బహుమతులు కూడా వచ్చే అవకాశాలున్నాయి. మీరు మతపరమైన మరియు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనడం ద్వారా సామాజిక సేవలో కూడా మీ ఆసక్తిని వ్యక్తం చేయవచ్చు. దాతృత్వం చేయడం మరియు ప్రజలకు సహాయం చేయడం కూడా ఈ సంవత్సరం మీకు సంతోషాన్నిస్తుంది. ఇది మీలో నిస్వార్థ సేవా స్ఫూర్తిని మరింతగా పెంచుతుంది. ఇది మిమ్మల్ని చాలా సంతోషంగా కనిపించేలా చేస్తుంది. ఈ సంవత్సరం మీరు సాధారణంగా ప్రయాణం చేయవలసి వస్తుంది. అంటే మీకు మిగిలిన వారిలా ఎక్కువగా ప్రయాణించే అవకాశాలు రాకపోవచ్చు. ఇది మీ ఆర్థిక వ్యయాలను తగ్గించే అవకాశం కలిగిస్తుంది. దీని వల్ల మీరు ఏడాది ముగిసేలోగానే మంచి బ్యాంక్ బ్యాలెన్స్‌ను మెయింటెన్ చేయగలగుతారు. ఈ సంవత్సరం మీ అన్నదమ్ములు, అక్క చెళ్లెల్ల నుంచి ప్రత్యేక మద్దతు పొందుతారు, ఇది కూడా మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపరుస్తుంది. అవసరమైన పరిస్థితుల్లో వారు మీకు ఆర్థికంగా సహాయం చేయవచ్చు. ఇది మీ సంబంధాన్ని బలోపేతం చేస్తుంది. దీని వల్ల మీకు ఆర్థిక సవాళ్లు కూడా కాస్తంత తక్కువగా ఉంటాయి. ఈ ఏడాది మీరు మీ కర్తవ్యాల్ని చాలా ధైర్యంతో పూర్తి చేస్తారు. బిజినెస్‌లో కొన్ని సందర్భాల్లో రిస్క్ తీసుకుని ముందుకెళ్లాల్సి రావచ్చు. ఈ ఏడాది మీ పిల్లలు కాస్త ఒడిదొడుకులకు లోనవుతారు. వారికి కొద్దిగా ఆరోగ్య సమస్యలు ఉండే అవకాశం ఉంది. ఈ ఏడాది మీరు కూడా మీ ఆర్థిక సంవత్సరంలో హెచ్చు తగ్గులు ఎదుర్కోవలసి వస్తుంది. మీరు ముక్కుసూటిగా మాట్లాడతారు. ఇలా మీరు విస్పష్టంగా మాట్లాడటం కొందరికి చేదుగా అనిపిస్తుంది. అయితే వారిని మీ మాటకు ఒప్పించే బాధ్యత కూడా మీరే తీసుకోవలసి ఉంటుంది. ఎందుకంటే వారితో మీకున్న సంబంధాన్ని దీర్థకాలం కొనసాగించాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి.
మకర రాశి
మకరరాశి వారు తమ గురించి మాత్రమే ఆలోచిస్తారు, కొంత వరకూ స్వార్థంగానే అడుగులేస్తారు. ఇది వారి విషయంలో కొంత వరకూ నిజమే అయినా, వాస్తవంగా సమాజాన్ని మార్చే ప్రయత్నంలో వారు కూడా కొంత వరకూ మారుతారు. గతేదాడి మాదిరిగానే ఈ ఏడాది కూడా మీకు అదే జరుగుతుంది. మీ మనస్సులో కొన్ని తీక్షణమైన అంశాలు, ఆశయాలు ఉండొచ్చు. వాటి ప్రభావంతో మీరు రాజకీయ రంగంలోకి ప్రవేశించి విజయం కూడా సాధింవచ్చు. మీరు ఈ సంవత్సరం ప్రయాణాలు చేయడానికి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం కూడా ఉండకపోవచ్చు. అయితే మీరు ఎక్కువ సమయం ఇంటికి దూరంగా ఉండం వల్ల విజయం సాధించగలుగుతారు. ఒకవేళ మీరు సొంతింట్లో ఉంటున్నట్లయితే, మీరు విధి నిర్వహణ, ఇతర పనుల నిమిత్తం మీ కుటుంబానికి దూరంగా వెళ్లే అవకాశం ఉంది. కానీ దీనివల్ల కూడా మీరుప్రయోజనాలు పొందుతారు. సంవత్సరం ప్రారంభంలో విదేశీ ప్రయాణాలు చేసే అవకాశముంది. కాబట్టి మీరు మీ సమయాన్ని ఖాళీగా వృథా చేయకుండా, గట్టిగా ఆ ప్రయత్నాలు చేయండి. ఈ ఏడాది మీరు అనేక రంగాల్లో ముందుకు సాగే అవకాశం ఉంది. మీరు మీ వృత్తిని మెరుగుపరచుకోవడానికి ప్రయత్నాలు చేయాల్సి రావచ్చు. ఫిబ్రవరి నుండి మార్చి మధ్య, ఏదైనా మంచి గ్యాడ్జెట్, లేదా మంచి మొబైల్ కొనుగోలు చేయవచ్చు. మీ కుటుంబంలో ఏదైనా శుభకార్యం లేదా పూజ-పారాయణం వంటివి నిర్వహించే అవకాశం రావచ్చు. ముఖ్యంగా సెప్టెంబర్-అక్టోబర్ నెలలో ఇంట్లో కొన్ని శుభవార్తలు వచ్చే సూచనలు ఉన్నాయి. మీ మనస్సులో కొన్ని భౌతిక పరమైన వాంఛలు ఉండవచ్చు. కానీ కొన్నిసార్లు మీరు సన్యాసిలా ప్రవర్తిస్తారు. అంటే మీరు మనసు ఎక్కువగా వ్యక్తులు ఉండే అంశాల మీద దృష్టి పెట్టలేకపోయే అవకాశముంది. కాబట్టి మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోడానికి ప్రయత్నించండి, దీని వల్ల మీకు పెద్దగా నష్టం ఎదురయ్యే అవకాశం ఉండదు. పైగా దాని ప్రభావంతో మీరు పెద్దగా నష్టపోవాల్సిన అవసరం కూడా ఉండదు. ఈ ఏడాది నాన్నగారితో మీకున్న సంబంధం కాస్తంత ప్రభావితం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి దానిని దృష్టిలో ఉంచుకోండి.
కుంభ రాశి
కుంభ రాశి వారికి 2023 సంవత్సరం కొన్ని శుభవార్తలను తీసుకొస్తుంది. ఈ ఏడాది మీరు మీ ఆరోగ్యంపై ఎక్కువగా శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. మీరు మీ ఆరోగ్యంపై శ్రద్ధ చూపకపోతే, అనారోగ్యానికి గురవుతారు దీనివల్ల మీ ఆరోగ్యం తీవ్రంగా క్షీణించే అవకాశముంది. దీనికారణంగా మీరు ఆసుపత్రిలో కూడా చేరాల్సి రావచ్చు. ఈ ఏడాది మీరు మీ ఆదాయంలో గణనీయమైన పెరుగుదల ఉండవచ్చు. ఇది మీ ఆర్థిక పరిస్థితిని మరింత బలోపేతం చేస్తుంది. మీరు ఉద్యోగం చేస్తున్నట్లయితే, మీరు ఇంక్రిమెంట్ పొందుతారు, ఇంకా మీకు మీ జీతంలో పెరుగుదల కూడా ఉంటుంది. ఒకవేళ మీరు బిజినెస్ చేస్తున్నట్లయితే, మీ లాభం పెరుగుతుంది. ప్రభుత్వ రంగం నుండి కూడా మంచి ప్రయోజనకరమైన పథకాల్ని మీరు సక్రమంగా వినియోగించుకోవడం ద్వారా మంచి మొత్తాన్ని సంపాదించుకోగలుగుతారు. ఏడాది మొదట్లో మీ కుటుంబ జీవితంలో కొద్ది పాటి ఉద్రిక్తతలు తలెత్తవచ్చు. కానీ ఏప్రిల్ నుండి సెప్టెంబర్ నెల మధ్య కాలంలో మాత్రం అంతా సర్ధుకుంటుంది. కుటుంబంలోని మీ పెద్దల నుండి మీకు మద్దతు లభిస్తుంది. దీని వల్ల మీరు మీ పనిలో విజయం సాధిస్తారు. ఏడాది ప్రారంభంలో మీ తోబుట్టువులతో కొన్ని వాదనలు ఉంటాయి. అయినప్పటికీ మీకు అవసరమైన సమయాల్లో వారు మీకు సాధ్యమైన అన్ని విధాలుగా సహాయం చేస్తారు. దీని కారణంగా మీరు వారితో మరింత అనుబంధం పెంచుకోవచ్చు. ఇది మీ మధ్య సంబంధాన్ని అత్యంత మధురంగా మారుస్తుంది. కుంభరాశి వారు ఈ ఏడాది స్నేహితులతో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ సంవత్సరం మీ స్నేహితుల్లో ఒకరు మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది. మీరు విదేశాలకు వెళ్లాలనుకుంటున్నట్లయితే, మీ కోరిక ఈ ఏడాది చాలా వరకూ నెరవేరేందుకు అవకాశం ఉంది. ఈ ఏడాది మీరు విదేశాలకు వెళ్లే అవకాశం మీకు దక్కవచ్చు. జూలై మరియు సెప్టెంబర్ మధ్య, రియల్ ఎస్టేట్‌కు సంబంధించిన విషయాలు మీ దృష్టిని ఆకర్షిస్తాయి. దీనివల్ల మీరు కొంత పెద్ద ఆస్తిని పొందుతారు. మీ ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. అయితే ఇతరుల విషయాల్లో మీరు జోక్యం చేసుకోకుండా ఉండటం శ్రేయస్కరం. ఈ ఏడాది మీకు మంచి పేరు ప్రఖ్యాతలు వచ్చే అవకాశం ఉంది.
మీన రాశి
మీన రాశి వారు చాలా ఎమోషనల్‌గా ఉంటారు. అయినప్పటికీ వారుచాలా తెలివైన వారు. ఈ ఏడాది మీ తెలివితేటలు మీకు చాలా వరకూ ఉపయోగకరంగా ఉంటాయి. దీనివల్ల మీరు ఏ రంగంలో అడుగుపెట్టినా, మీ తెలివితేటలు, పరిజ్ఞానం కారణంగా మంచి విజయాలు సాధించేలా మెరుగైన పనితీరు కనబరుస్తారు. ఈ ఏడాది మీరు సగటు కన్నా ఎక్కువ విజయాన్ని సాధిస్తారు. ఆదాయపరంగా చూస్తే, మీరు ఇప్పుడు చాలా మంచి స్థితిలో ఉన్నారు. ఇంకా మీ బ్యాంక్ బ్యాలెన్సు కూడా పెరుగుతుంది. ఈ సంవత్సరం మీరు గతేడాది కన్నా కాస్త తక్కువగా ప్రయాణాలు చేస్తారు. మీరు ఈ ఏడాది మీ తోబుట్టువుల మద్దతు సాధిస్తారు. అయితే వారితో గొడవ పడకుండా కాస్త స్థిమితంగా ఉండండి. ఎందుకంటే వారేమీకు అతి పెద్ద బలం. మీ కుటుంబ వాతావరణం చాలా బాగుంటుంది. మీకు అవసరమైన సందర్భాల్లో కుటుంబ పెద్దల మద్దతు దొరుకుతుంది. వారి ఆశీర్వాద బలంతో మీరు మీ పనిలో మరింత ముందుకు సాగుతారు. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ మీ చర్యలతో వారి మనసును గాయపర్చకండి. దీని వల్ల మీ పనిలో, ఇంకా మీ ఆరోగ్యంలో మీకు ఇబ్బంది కలగవచ్చు. మీరు విదేశాల్లో నివసిస్తున్నట్లయితే, ఈ ఏడాది స్వదేశంలో మీ ఇంటికి తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది. డబ్బు సంపాదనతో పాటు, కుటుంబానికి సమయం ఇవ్వడం కూడా అవసరం కావచ్చు, ఎందుకంటే డబ్బు సంపాదించాలనే కోరిక మిమ్మల్ని కుటుంబానికి దూరంగా ఉంచుతుంది. కాబట్టి, వాటిని కూడా జాగ్రత్తగా చూసుకోవాలని సూచించారు. మీ ఆత్మవిశ్వాసం చాలా చక్కగా ఉంటుంది. మీ తెలివితేటలు, మీకున్న పరిజ్ఞానంతో మీరు అన్ని రంగాలలో బాగా రాణించగలరు. వీటి కారణంగా ఈ ఏడాది మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. వయస్సుతో సంబంధం లేకుండా మీరు ఏదైనా కొత్త కోర్సును చేయాలనుకుంటే, ఇది మీకు పూర్తి విజయాన్ని సాధించే సమయం. మీరు దానిన బాగా అధ్యయనం చేయడమే కాదు, మీరు దానిని వృత్తిగా కూడా కొనసాగించే అవకాశముంది. సంవత్సర మధ్యలో మీరు మీ కుటుంబంతో కలసి విహార యాత్రకు వెళ్లే అవకాశముంది. కొన్ని సందర్భాల్లో మతపరమైన యాత్రకు వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయి.
Comments
Post a Comment