కుప్పంలో దారుణం.. 8ఏళ్ల బాలికపై వాలంటీర్ హత్యాచారయత్నం..!
- 5వ తరగతి బాలికపై హత్యాచారయత్నం
- కుప్పం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలిక
- పోలీసుల అదుపులో నిందుతుడు శివయ్య
- నేరస్థుని కఠినంగా శిక్షించాలి - మాజీ ఎమ్మెల్సి గౌనివారి శ్రీనివాసులు డిమాండ్
కుప్పం, త్రిశూల్ న్యూస్ :
అభం శుభం తెలియని ఓ చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు వాలంటీర్. ఎవరూ లేని సమయంలో బాలికకు మాయ మాటలు చెప్పి గ్రామ సమీపంలో అత్యాచారయత్నానికి ఒడిగట్టిన ఉదంతం కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలంలో చోటు చేసుకుంది.
స్థానికులు, పోలీసుల కథనం మేరకుువివరాలుుుు ఇలా ఉన్నాయి. చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం అబకలదొడ్డి పంచాయితీ వెంకటేషపురం గ్రామానికిిిి చెందిన శివయ్య వాలంటీర్ గా విధులు నిర్వహిస్తున్నాడు. అదేేేేేేేేేేేేే గ్రామానికి చెందిన 8ఏళ్ల పాప స్థానిక పాఠశాలలో 5వ తరగతి చదువుతోంది. ఈ క్రమంలో గురువారం సాయంత్రం పాఠశాల అయిన తరువాత ఒంటరిగా ఇంటివద్ద ఆడుకుంటున్న చిన్నారిని ఎవరులేని సమయం చూసి నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారాయత్నానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని చుసిన చుట్టు పక్కల వారు కేకలు వేయడంతో చిన్నారిని వదిలి శివయ్య పరారయ్యాడు. స్థానికులు హుటాహుటిన కుప్పం ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స కోసం బాలికను తరలించారు. ఈ ఘటనపై చిన్నారి కుటుంబసభ్యులు పోలీసులకు పిర్యాదు చేయడంతో నిందుతున్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టు సమాచారం.
నేరస్థుని కఠినంగా శిక్షించాలి - మాజీ ఎమ్మెల్సి గౌనివారి శ్రీనివాసులు
ఈ ఘటనపై టీడీపీ నాయకులు తీవ్రంగా ఖండించారు చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడిన వలంటీర్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గురువారం రాత్రి మాజీ ఎమ్మెల్సి గౌనివారి శ్రీనివాసులు కుప్పం ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొని బాలిక ఆరోగ్యం గురించి ఆరా తీశారు. బాలిక తల్లిదండ్రులకు మేము ఉంటామని దైర్యం చెప్పారు. ఈ సందర్బంగా మాజీ ఎమ్మెల్సి మాట్లాడుతూ నిందుతున్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. చిన్న పిల్లపై అఘాయిత్యానికి పాల్పడిన శివయ్యపై దిశా చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేయాలని వారు డిమాండు చేశారు.
Comments
Post a Comment