పేదలకు కేటాయించిన ఇళ్ళ నిర్మాణాలు వేగవంతం కావలి - తిరుపతి జిల్లా కలెక్టర్
తిరుపతి, త్రిశూల్ న్యూస్ :
తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో పేదలకు మంజూరు చేసిన లే ఔట్ లలో ఇళ్ళ నిర్మాణాలు వేగవంతం చేయాలని, ప్రభుత్వ ప్రాధాన్యతా పథకం అనేది గుర్తుంచుకుని లే ఔట్ ఇంచార్జులు పనిచేయాల్సి వుంటుందని అలసత్వం సహించేది లేదని జిల్లా కలెక్టర్ కె.వెంకటరమణా రెడ్డి ఆదేశించారు. శుక్రవారం ఉదయం స్థానిక కలెక్టరేట్ లో తిరుపతి నగరపాలక పరిధిలో మంజూరు అయిన గృహాలు, ఇంటి స్థలాలు కేటాయింపు పై జిల్లా కలెక్టర్, నగరపాలక కమిషనర్ అనుప అంజలి, తిరుపతి, శ్రీకాళహస్తి ఆర్దిఒలతో, హౌసింగ్ లే ఔట్ ఇంచార్జులతో సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. జిల్లా కలెక్టర్ సూచిస్తూ లే ఔట్ ఇంచార్జులు మరోమారు క్షేత్ర స్థాయిలో పరిశీలించి కేటాయించిన గృహాల వద్ద నిర్మాణాలకు అనువుగా వుందా, ఎత్తుపల్లాలు, కాలవలు వంటివి ఉంటే వాటిని సరిచేయడం చూడాలని అన్నారు. ఇప్పటికే కేటాయించిన 5 లే ఔట్ లలో 19,522 గృహాలలో ప్రారంభంకానివి 4 వేల వరకు ఉన్నాయని రానున్న జనవరి 15 నాటికి జియో టాగింగ్ చేపట్టి అన్ని గృహ నిర్మాణాలు ప్రారంభించాలని, నిర్మాణాల్లో వున్న వాటి స్టేజ్ కన్వర్షన్ వేగవంతంగా జరగాలని అన్నారు. అర్హతగల లబ్దిదారులకు 90 రోజుల ఇళ్ళ స్థలాల మంజూరు కూడా అందుబాటులో వున్న చోట కేటాయింపుకు సిద్దంగా వుండాలని సూచించారు. లే ఔట్ లలో వసతుల కోసం నిర్దేశించిన రహదారులు, కమ్యునిటీ హాల్స్ , ఇతర సౌకర్యాల కోసం కేటాయించిన 40 శాతం స్థలం అనువుగా వున్నది లేనిది చూడాలని తెలిపారు. ఎం.కొత్తపల్లి లే ఔట్ లో కొంత మేర లెవలింగ్ పెండింగ్ వుందని త్వరగా పూర్తిచేసి లబ్దిదారులకు అందించాలని ఆదేశించారు. భాద్యతతో పనిచేయాలని ఒప్పటికే 9 నెలలు గడిచిందని వాస్తవ పరిస్థితులు గమనించి అవగాహనతో త్వరగా పూర్తి చేయాలని అన్నారు. చిందేపల్లిలో భూసేకరణకు ఇప్పటికే పరిహారం చెల్లింపు జరిగింది, ఎ కేటగిరి ప్రతిపాదనలు వున్నాయి, అదనపు పరిహారం అందుతుంది పెండింగ్ వున్న ఆ కొద్ది పాటి స్థలంలో కూడా మార్కింగ్ పూర్తి చేసి ఇళ్ళ నిర్మాణాలు పారంభించాలని ఆదేశించారు. ఎదో ఒక కారణంతో కాలయాపన సరికాదు అన్నారు. ఈ సమీక్షలో అర్దిఒలు కనక నరసా రెడ్డి , రామారావు, హౌసింగ్ మరియు నరేగా పిడిలు పాల్గొన్నారు.
Comments
Post a Comment