Trishul News

సామాన్యుడిలా ప్రధాని మోదీ తల్లి అంత్యక్రియలు..!

అహ్మదాబాద్, త్రిశూల్ న్యూస్ :
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాతృమూర్తి హీరాబెన్ మోదీ అనారోగ్యంతో నేడు తెల్లవారుజామున కన్నుమూశారు. తల్లి చనిపోయిన విషయం తెలుసుకున్న ప్రధాని మోదీ అహ్మదాబాద్ కు చేరుకున్నారు. ఈ క్రమంలో ఆమె అంత్యక్రియలు గాంధీనగర్ స్మశానవాటికలో ముగిశాయి. అయితే దేశ ప్రధాని తల్లి అంత్యక్రియలు ఎలాంటి ప్రచారం, ఆడంబరం లేకుండా అంత్యక్రియలు ముగియడం గమనార్హం. ఉదయం 6 గంటలకు హీరాబెన్ మోదీ చనిపోయిన విషయం వెలుగులోకి రాగా ఉదయం 9.30కి అంత్యక్రియలకు సంబంధించి అన్ని పనులు పూర్తయ్యాయి. మధ్యాహ్నం 3.30కి అంతిమయాత్ర కూడా ప్రారంభం కాగా ఎటువంటి హడావుడి లేకుండానే సాగింది. అయితే ప్రధాని తల్లి అయి ఉండి సామాన్యుడిలాగే ఆమె అంత్యక్రియలు జరగడం నిజంగా చెప్పుకోదగ్గ విషయం. ఉదయం నుండి సాయంత్రం వరకు మీడియా లైవ్ లేకపోగా.. అంత్యక్రియలకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు లేవు. రోడ్డుపై ట్రాఫిక్ జామ్ లేదు. కనీసం ప్రజా దర్శనానికి కూడా ఏర్పాట్లు చేయలేదు. ఇక ప్రధాని మోదీ అభిమానుల నుండి నినాదాలు లేవు కదా దహనసంస్కారాలకు ఎకరం భూమిని కూడా చదును చేయలేదు. ఆమె మృతదేహంపై జాతీయ జెండా లేదు. ఆమెను దహనం చేయడానికి గంధపు చెక్క వాడలేదు. సాధారణంగా ఓ సామాన్య వ్యక్తికి ఎలాగైతే అంత్యక్రియలు జరుగుతాయో అదేవిదంగా సాదాసీదాగా అంత్యక్రియలు జరిపారు. ఇక అంతిమయాత్ర కూడా చాలా సింపుల్ గా చేశారు. దేశ ప్రధాని తల్లి అంత్యక్రియలు ఇలా సాదాసీదాగా జరగడం గొప్ప విషయమనే చెప్పుకోవాలి.

Post a Comment

Previous Post Next Post