అమ్మఒడితో ఆర్ధిక భరోసా.. గుడుపల్లె హైస్కూల్ విద్యార్థులకు ట్యాబ్ లు పంపిణీ..!

గుడుపల్లె, త్రిశూల్ న్యూస్ : 
రాష్ట ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ అమ్మఒడి పథకంతో ఆర్థిక భరోసా కల్పించారని వైసిపి నేతలు తెలిపారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం గుడుపల్లె జిల్లా పరిషత్ ఉన్నత హైస్కూల్ లో ఎనిమిదవ తరగతి విద్యార్థులకు ట్యాబులను శుక్రవారం పంపిణి చేశారు. హై స్కూల్ చేర్మెన్ వి.చంద్రప్ప అధ్యక్షతన జరిగిన సమావేశంలో నేతలు మాట్లాడుతూ.. తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక ఏ రాష్ట్రానికి వెళ్లినా మీకు లాంటి ముఖ్యమంత్రి మాకు లేరే అని బాధపడుతున్నారని అన్నారు.  మన రాష్ట్రంలో పిల్లల చదువు కోసం ఖర్చు పెడుతున్న తీరు చూస్తే మీపై సీఎంకు ఎంత అభిమానం ఉందొ అర్థమవుతుందని అన్నారు. సరైన ఆహారం లేకుండా వున్నారని పిల్లల కోసం జగనన్న స్వయంగా జగనన్న గోరుముద్ద మెనూ రూపొందించారని తెలిపారు. వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి మన ముఖ్యమంత్రిగా ఉండడం మన రాష్ట్ర ప్రజలు చేసుకున్న అదృష్టం అని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలో ఎనిమిదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు బైజూస్ విద్యా కంటెంట్ తో ట్యాబులు పంపిణీ చేసినట్లు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 4,59,564 మంది విద్యార్థులు, 59,176 మంది ఉపాధ్యాయులు మొత్తం 5,18,740 మందికి ట్యాబుల విలువ 688 కోట్లు మరియు బైజూస్ ఫ్రీ లోడెడ్ కంటెంట్ విలువ 778 కోట్లు మొత్తం 1,466 కోట్ల రూపాయలు ప్రభుత్వం వినియోగించినట్లు తెలిపారు.
రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్కారణలకోసం గత మూడున్నర సంవత్సరాలలో వైస్సార్సీపీ ప్రభుత్వం జగనన్న అమ్మఒడీ 44.49 లక్షల మందికి 19,617 కోట్లు, జగనన్న విద్యాదీవెన 24.75 లక్షలమందికి 9,051 కోట్లు, జగనన్న వసతి దీవెన 18.78 లక్షల మందికి 3,349 కోట్లు, జగనన్న విద్యాకానుక 47.72 లక్షల మందికి 2,368 కోట్లు, ట్యాబు ల పంపిణి 5.18 లక్షల మందికి 688 కోట్లు, జగనన్న గోరుముద్ద 43.26 లక్షల మందికి 3,239 కోట్లు, నాడునేడు మొదటి దశ 15,634 స్కూల్స్ 3,669 కోట్లు, రెండవ దశ 22,344 విద్యా సంస్థలు 8,000 కోట్లు, వైస్సార్ సంపూర్ణ పోషణ 34.19 లక్షల మందికి 4,895 కోట్లు, స్వేచ్చా సానిటరీ నాపకిన్స్ 10.01 లక్షల మందికి 32 కోట్లు మొత్తం 54,910 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినట్టు వివరించారు. ఈ సమావేశంలో మండల వైసీపీ నేతలు, ప్రజాప్రతినిధులు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

వైసీపీ ప్రభుత్వం డేటా ఎంట్రీ ఆపరేటర్లను కూడా వేదనకు గురి చేసింది - పవన్ కళ్యాణ్

కడుపు మండిన ఉద్యోగులు.. రేపు వర్సిటి బంద్ కు పిలుపు..!

ద్రావిడ ఉద్యోగుల నిరసన భగ్నానికి రిజిస్టర్ యత్నం? - ద్రావిడ ఉద్యోగులు