రాజంపేట జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు..!

- జనసేన వీర మహిళలకు చీరలు పంపిణీ చేసిన నేతలు 

- కేకు కట్ చేసి సంబరాలు జరుపుకున్న జనసేన నాయకులు
 రాజంపేట, త్రిశూల్ న్యూస్ :
నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని రాజంపేట జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు అట్టహాసంగా నిర్వహించారు. రాజంపేట జనసేన పార్టీ ఇంచార్జ్ మలిశెట్టి వెంకటరమణ ఆదేశాల మేరకు శనివారం జనసేన యువ నాయకులు పోలిశెట్టి శ్రీనివాసులు ఆధ్వర్యంలో ముందస్తుగా కేక్ కట్ చేసి నూతన సంవత్సర వేడుకలకు ఆహ్వానం పలికారు. నూతన సంవత్సర సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు రాజంపేట నియోజకవర్గ ప్రజలందరికీ అలాగే నాయకులకు కార్యకర్తలకు జనసేన నాయకులు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈసందర్భంగా జనసేన యువనాయకులు పోలిశెట్టి శ్రీనివాసులు మాట్లాడుతూ ఓమిక్రాన్ వ్యాధి బారిన పడకుండా శారటైజర్, మాస్క్ తప్పనిసరిగా వాడాలని ప్రజలంతా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీని గ్రామస్థాయి నుంచి మండల స్థాయి వరకు ప్రతి ఒక్క జనసేన నాయకులు జనసైనికులు పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని ఆయన సూచించారు.అనంతరం పవనన్న ప్రజా బాట కార్యక్రమంలో భాగంగా నేటికీ 45 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా నూతన సంవత్సర కానుకగా 100 మంది జనసేన వీర మహిళలకు చీరలు స్వీట్లు అందజేశారు.
జనసేన నాయకుడు తాళ్లపాక శంకరయ్య మాట్లాడుతూ కడప జిల్లా వాసి అయిన ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని అభివృద్ధి చేస్తాడని నమ్మకంతో ప్రజలు గెలిపిస్తే అది మానేసి ఇలా దారుణంగా ప్రజలను మభ్యపెట్టడం సరికాదన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రజల సమస్యలపై పోరాడుతుంటే ప్యాకేజీ స్టార్ అనడం విడ్డూరంగా ఉందన్నారు. వైసిపి పార్టీ మంత్రి రోజాకి ఎస్సీ, ఎస్టీలు అంటే మీకు అంత అలుసా దళితులు అంటే అంత చులకనా..  వచ్చే ఎన్నికల్లో మీకు అదే ఎస్సీ, ఎస్టీలు బుద్ధి చెబుతారన్నారు. రాబోయే 2024 ఎన్నికల్లో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావడం ఖాయమన్నారు. ఈ సందర్బంగా ప్రజలందరూ కొత్త సంవత్సరంలో సంతోషంగా, ఆరోగ్యాంగా జీవించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన రాష్ట్ర చేనేత వికాస కార్యదర్శి రాటాల రామయ్య, న్యాయవిభాగం కత్తి సుబ్బరాయుడు, భాస్కర్ పంతులు జనసేన యువ నాయకులు పోలిశెట్టి శ్రీనివాసులు, బాలసాయి కృష్ణ, వెంకటయ్య, పోలిశెట్టి చంగల్ రాయుడు,  మన్నూరు గోపి, జంగాల శిరీష, తదితరులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

వైసీపీ ప్రభుత్వం డేటా ఎంట్రీ ఆపరేటర్లను కూడా వేదనకు గురి చేసింది - పవన్ కళ్యాణ్

కడుపు మండిన ఉద్యోగులు.. రేపు వర్సిటి బంద్ కు పిలుపు..!

ద్రావిడ ఉద్యోగుల నిరసన భగ్నానికి రిజిస్టర్ యత్నం? - ద్రావిడ ఉద్యోగులు