కందుకూరు ఘటన విధి వక్రీకరించి, దేవుడు చిన్నచూపు చూశాడు - చంద్రబాబు
కొండముడుసు, త్రిశూల్ న్యూస్ :
నెల్లూరు జిల్లాలోని కందుకూరులో నిన్న టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు నిర్వహించిన 'ఇదేం కర్మ రాష్ట్రానికి' కార్యక్రమంలో అపశృతి చోటు చేసుకున్న విషయం తెలిసిందే. అయితే.. ఈ కార్యక్రమంలో తొక్కిసలాట జరిగి 8 మంది మృతి చెందారు. ఈ ఘటనపై తాజాగా కొండముడుసు పాలెంలో కలవకూరి యాదాది కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు చంద్రబాబు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎక్కడికక్కడ అప్రమత్తం చేస్తూ వస్తున్నా కార్యకర్తల భావోద్వేగoతో దురదృష్టకర సంఘటన చోటుచేసుకుందన్నారు. అంతేకాకుండా.. ‘నా కళ్ల ముందు నిన్న జరిగిన సంఘటన ఎంతో బాధ కలిగిస్తోంది. ప్రజల్ని చైతన్య పరిచే కార్యక్రమంలో దురదృష్టకర సంఘటన చోటుచేసుకుంది. చనిపోయిన 8మందిలో ఆరుగురు బడుగు బలహీన వర్గాల వారు. విధి వక్రీకరించి, దేవుడు చిన్నచూపు చూసినప్పుడు ఇలాంటి సంఘటనలు చోటుచేసుకుంటాయి.కుటుంబ సభ్యుల ప్రశ్నలకు నా దగ్గర సమాధానం లేదు కానీ ఓ కుటుంబ పెద్దగా వారి భవిష్యత్తు బాధ్యత నేను తీసుకుంటా. నేనే చేసే ఉద్యమం రాష్ట్రం కోసం. చనిపోయిన వారు రాష్ట్రం కోసం సమిధులుగా మారారు. సంఘటన పట్ల ఎవ్వరినీ నిందించను కానీ తగిన భద్రత కల్పించాల్సిన బాధ్యత పోలీసులది. ప్రజలు భవిష్యత్తు పై నమ్మకం కోల్పోయి తెదేపా సభలకు పెద్దఎత్తున వస్తున్నారు. ఇకనైనా సంఘటన లు పునరావృతం కాకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలి. ప్రజలు స్వచ్ఛందంగా వస్తుంటే, దానిని విమర్శించాలనుకోవటం తప్పు. కందుకూరు ఎన్టీఆర్ సెంటర్ లో అన్ని రాజకీయ పార్టీలు సభలు పెట్టాయి. నిన్న జరిగిన సభే మొదటిది కాదు. కావాలి సభలో అప్రమత్తంగా ఉండాలని శ్రేణుల్ని కోరుతున్నా. ప్రభుత్వం మనకి సహకరించకపోయినా మన జాగ్రత్తలు మనమే తీసుకుందాం.’ అని ఆయన వ్యాఖ్యానించారు.
Comments
Post a Comment