యువగళం పాదయాత్రను విజయవంతం చేయండి - గుడుపల్లె తెదేపా నేతలు

గుడుపల్లె, త్రిశూల్ న్యూస్ :
లోకేష్ జనవరి 27 న చేపట్టే యువగళం కార్యక్రమం పాదయాత్రను యువత పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని
చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం గుడుపల్లె మండల తెదేపా నేతలు పిలుపునిచ్చారు. శుక్రవారం గుడుపల్లె టిడిపి కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా మండల పార్టీ అధ్యక్షులు టిఎం. బాబు నాయుడు, పార్టీ ఇంచార్జి జిఎం. రాజు, మాజీ జడ్పీటీసీ సభ్యులు పి. బేటప్ప నాయుడులు మాట్లాడుతూ.. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుండి అన్ని వర్గాల వారు ఇబ్బందులుకు వివక్షకు, నిర్లక్ష్యానికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని పరిశ్రమలు ఇతర రాష్ట్రాలకు తరలిపోతున్నాయని, గత తెలుగుదేశం పార్టీ హయాములో అండగా ఉండేందుకు నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి ఇచ్చేవారని, ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దానిని కూడా రద్దు చేశాడని విమర్శించారు. యువతకు అండగా నిలబడాలన్న ఉద్దేశంతో యువత హక్కులు సమస్యలపై పోరాటం చేసేందుకు తెలుగుదేశం పార్టీ యువ నాయకులు జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జనవరి 27 నుంచి పాదయాత్రను ప్రారంభించనున్నారని, ఈ పాదయాత్ర కుప్పం నుండి ప్రారంభమై 400 రోజులు 4000 కిలోమీటర్ల మేర ఈ పాదయాత్ర ఉంటుందని అన్నారు. నారా లోకేష్ చేపట్టే ఈ యువగళం కార్యక్రమం 100కు పైగా అసెంబ్లీ నియోజకవర్గాలలో సాగుతుందని యువతకు అండగా ఉండాలని చేపట్టే ఈ యువగలం కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న యువత పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. నారా లోకేష్ తో కలిసి నడవండి.. మెరుగైన ఆంధ్రప్రదేశ్ కోసం పాటుపడుదం అని పేర్కొన్నారు. జనవరి 27న కుప్పం నుండి ప్రారంభం అయ్యే యువగళం పాదయాత్రకు గుడుపల్లె మండలంలోని యువత పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ పార్టీ అధ్యక్షులు హేమంబర్ గౌడు, మండల యువత అధ్యక్షులు లక్ష్మీపతి, మాజీ రెస్కో డైరెక్టర్ రామచంద్రుడు, శీనప్ప తదితరులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

వైసీపీ ప్రభుత్వం డేటా ఎంట్రీ ఆపరేటర్లను కూడా వేదనకు గురి చేసింది - పవన్ కళ్యాణ్

కడుపు మండిన ఉద్యోగులు.. రేపు వర్సిటి బంద్ కు పిలుపు..!

ద్రావిడ ఉద్యోగుల నిరసన భగ్నానికి రిజిస్టర్ యత్నం? - ద్రావిడ ఉద్యోగులు