జనసేన వీర మహిళలకు చీరల పంపిణీ..!
- నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని జనసేన నేతలు చీరలు పంపిణీ
సిద్ధవటం, త్రిశూల్ న్యూస్ :
నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని రాజంపేట జనసేన పార్టీ ఇంచార్జ్ మలిశెట్టి వెంకటరమణ సహకారంతో జనసేన రాష్ట్ర చేనేత వికాస కార్యదర్శి రాటాల రామయ్య ఆధ్వర్యంలో సిద్ధవటం మండల పరిధిలోని ఉప్పరపల్లె గ్రామంలో శుక్రవారం ముందస్తుగా నూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించారు. అనంతరం జనసేన పవనన్న ప్రజా బాట కార్యక్రమం 45వ రోజు పూర్తి చేసుకున్న సందర్భంగా జనసేన వీర మహిళలకు చీరలు పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా రాజంపేట జనసేన నాయకులు హాజరై 40 మంది జనసేన వీర మహిళలకు చీరలు అందజేశారు.
ఈసందర్భంగా జనసేన రాష్ట్ర చేనేత వికాస కార్యదర్శి రాటాల రామయ్య మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు రాజంపేట నియోజకవర్గ ప్రజలకు జనసేన నాయకులకు కార్యకర్తలకు ముందస్తుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఓమిక్రాన్ వ్యాధిన పడకుండా శానిటైజర్ మాస్క్ తప్పనిసరిగా వాడాలని ప్రజలంతా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీని ప్రతి ఒక్క జనసేన నాయకులు, జనసేన కార్యకర్తలు, జనసైనికులు గ్రామస్థాయి నుండి మండల స్థాయి వరకు పార్టీ అభివృద్ధికి కృషి చేసి రాబోయే 2024 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రి చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈకార్యక్రమంలో లీగల్ సెల్ కత్తి సుబ్బరాయుడు, భాస్కర్ పంతులు, పోలిశెట్టి శ్రీనివాసులు, తాళ్లపాక శంకరయ్య, పోలిశెట్టి చెంగల్ రాయుడు, జనసేన వీర మహిళ తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment