గుడుపల్లె వైసిపి ప్రచార కార్యదర్శిగా వెంకటాచలం..!
గుడుపల్లె, త్రిశూల్ న్యూస్ :
చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం గుడుపల్లె మండల వైస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రచార కార్యదర్శిగా వి. వెంకటాచలంను చిత్తూరు ఎమ్మెల్సి, జిల్లా వైసిపి అధ్యక్షులు కెఆర్ జె. భరత్ నియమించారు. ఈ సందర్బంగా ప్రచార కార్యదర్శి వి. వెంకటాచలం మాట్లాడుతూ మండలంలో వైసిపి పార్టీ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని చెప్పారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజారంజక పథకాలపై గ్రామ స్థాయిలో ప్రచారం నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పిస్తామని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నవరత్నాల పథకం ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరికి లబ్ది చేకూరేలా కృషి చేస్తానన్నారు. ఎన్నికలకు ఇంకా ఏడాది ఉండడంతో ప్రతి గ్రామంలో పార్టీ కార్యక్రమాలు నిర్వహించి రాబోయే ఎన్నికల్లో వైసిపి గెలుపుకు నిరంతరం పనిచేస్తానని తెలిపారు. నామీద ఎంతో నమ్మకంతో నాకు పదవి రావడానికి కారుకులకు ధన్యవాదములు తెలుపుకుంటున్నానన్నారు. ఈ సందర్బంగా ఎమ్మెల్సి భరత్ నియామక పత్రాన్ని వి. వెంకటాచలంకు అందజేశారు.
Comments
Post a Comment