జీవో నెంబర్ 1 పై వెకేషన్ బెంచ్ విచారణ.. ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు..!
అమరావతి, త్రిశూల్ న్యూస్ :
జీవో నెంబర్ 1పై వెకేషన్ బెంచ్ విచారణ చేయడంపై ఏపీ హైకోర్టు సీజే ధర్మాసనం సోమవారం నాడు కీలక వ్యాఖ్యలు చేసింది. వెకేషన్ బెంచ్ ముందు ఈ పిటిషన్ ను విచారించడంపై హైకోర్టు ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. హైకోర్టు రిజిస్ట్రీ తమకు అన్ని విషయాలను నివేదించినట్టుగా హైకోర్టు వ్యాఖ్యలు చేసినట్టుగా సమాచారం. జీవో నెంబర్ 1పై ఏపీ హైకోర్టులో సోమవారం నాడు విచారణ జరిగింది. ఈ విచారణ సందర్భంగా ఏపీ హైకోర్టు సీజే ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. జీవో నెంబర్ 1పై అత్యవసంర లేకపోతే వెకేషన్ బెంచ్ ముందుకు ఎందుకు వచ్చారని హైకోర్టు సీజే ధర్మాసనం ప్రశ్నించింది. ఈ పిటిషన్ వెకేషన్ బెంచ్ విచారణ చేయడంపై సీజే ధర్మాసనం వ్యాఖ్యలు చేసింది. వెకేషన్ బెంచ్ పరిధి దాటి వ్యవహరించిందని హైకోర్టు అభిప్రాయపడింది. వెకేషన్ బెంచ్ సీజే బుదులుగా పనిచేస్తుందన్న హైకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. లంచ్ మోషన్ మూవ్ చేయాల్సిన తొందర ఏముందని కూడా ప్రశ్నించింది. ఈ విషయమై ఏం జరుగుతుందో తమకు అంతా తెలుసునని కూడా ఏపీ హైకోర్టు వ్యాఖ్యలు చేసింది. పిటిషనర్ కు బెనిఫిట్ చేయడానికి కాకపోతే తొందర ఏమొచ్చిందని కూడా వ్యాఖ్యానించింది హైకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించిందని ప్రముఖ తెలుగు న్యూస్ ఎన్టీవీ కథనం ప్రసారం చేసింది. ఈ 10 రోజుల్లో ఏమైనా ధర్నాలు జరిగాయా అని ఏపీ హైకోర్టు ప్రశ్నించింది. సీపీఐ రాష్ట్ర సమితి కార్యదర్భి రామకృష్ణ తరపున లాయర్ రాజు రామచంద్రన్ వాదనలు విన్పించారు. మరో వైపు ఈ కేసు విచారణను ఈ ఏడాది ఫిబ్రవరి 5వ తేదీకి వాయిదా వేయాలని అడ్వకేట్ జనరల్ కోరారు. రాజ్యాంగం కల్పించిన హక్కులకు భంగం కల్గినప్పుడు తప్పనిసరిగా న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తరపు న్యాయవాది రాజు రామచంద్రన్ హైకోర్టు దృష్టికి తీసుకు వచ్చారు. జీవో నెంబర్ 1 రాజ్యాంగ విరుద్దంగా ఉందని ఆయన వాదించారు. సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ ప్రకారంగా ఆమోదయోగ్యమైన ఆంక్షలు విధించవచ్చని ఆయన హైకోర్టు ముందు వాదనలు విన్పించారు. ఈ జీవో ప్రకారంగా రోడ్లపై ర్యాలీలు నిర్వహించకుండా నిషేధం విధించడం సరైంది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. రహదారులు ప్రజల అభిప్రాయాలను తెలిపేందుకు సహజ సిద్దమైన వేదికలని సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పులను ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. జీవో నెంబర్ 1పై ఏపీ హైకోర్టు ఇచ్చిన సస్పెన్షన్ ను ఎత్తివేయాలని అడ్వకేట్ జనరల్ కోరారు. ఈ విషయమై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కూడా అడ్వకేట్ జనరల్ ఏపీ హైకోర్టును కోరారు.ఇవాళ ఉదయం నుండి ఈ పిటిషన్ పై ఏపీ హైకోర్టు సీజే ధర్మాసం విచారణ నిర్వహిస్తుంది. లంచ్ తర్వాత ఈ పిటిషన్ పై విచారణ నిర్వహిస్తామని ప్రకటించింది.జీవో నెంబర్ 1 ని సవాల్ చేస్తూ సీపీఐ ఏపీ రాష్ట్ర సమితి కార్యదర్శి రామకృష్ణ ఈ నెల 12వ తేదీన ఏపీ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారణ నిర్వహించిన ఏపీ హైకోర్టు వెకేషన్ బెంచ్ ఈ జీవోను సస్పెండ్ చేసింది. ఏపీ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం ఈ నెల 17వ తేదీన స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది.ఈ పిటిషన్ పై విచారణ నిర్వహించిన సుప్రీంకోర్టు ఈ పిటిషన్ పై తాము జోక్యం చేసుకోలేమని తెలిపింది. స్టే ఎత్తివేసిందుకే సుప్రీంకోర్టు నిరాకరించింది. అంతేకాదు ఈ పిటిషన్ పై హైకోర్టు సీజే విచారణ చేయాలని కూడా ఆదేశించింది.
Comments
Post a Comment