విజయవాడలో భారీ అగ్నిప్రమాదం.. 20 దుకాణాలు దగ్ధం..!
విజయవాడ, త్రిశూల్ న్యూస్ :
ఎన్టీఆర్ జిల్లాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఎన్టీఆర్ జిల్లాలోని పెనుగంచిప్రోలు తిరుపతమ్మ ఆలయంలో ఈ ప్రమాదం సంభవించింది. తిరుపతమ్మ ఆలయంలో గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ప్రమాదంలో దాదాపు 20 దుకాణాలు అగ్నికి ఆహుతి అయ్యాయి. దాదాపు 50 లక్షల రూపాయల మేరకు ఆస్తి నష్టం సంభవించినట్లు భావిస్తున్నారు. విద్యుత్తు షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం సంభవించి ఉండవచ్చునని అధికార వర్గాలు అంటున్నాయి. అర్థరాత్రి జరిగిన ఈ భారీ అగ్ని ప్రమాదంలో 20 దుకాణాలు దగ్ధమయ్యాయి. వచ్చేనెల 5వ తేదీ నుంచి తిరుపతమ్మ పెద్ద తిరునాళ్లు జరగనున్నాయి. ఈ నేపత్యంలో వ్యాపారులు తమ దుకాణాల్లో పెద్ద ఎత్తున వస్తువులను కొని పెట్టారని సమాచారం. 20 దుకాణాల్లోని ఒక్కో దుకాణంలో రూ.2నుంచి రూ.3 లక్షల విలువైన వస్తువులు ఉన్నాయని తెలుస్తోంది. ఈ సామాగ్రి అంతా అగ్నికి ఆహుతయ్యింది. ఇవన్నీ పూర్తిగా కాలిబూడిదయ్యాయి. మొత్తంగా ఈ అగ్నిప్రమాదంలో రూ.50 లక్షల ఆస్తి నష్టం జరిగింది. ఘటనా స్థలిని ఆలయ ఈవో, చైర్మన్, తహసీల్దార్ పరిశీలించినట్టు సమాచారం. తిరుపతమ్మ ఆలయం ఆవరణలోని బొమ్మల దుకాణంలో మంటలు అంటుకున్నాయి. వచ్చే నెల 5వ తేదీ నుంచి తిరునాళ్లు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలోని వ్యాపారులు భారీగా సామగ్రి కొని నిలువ చేశారు. ప్రమాదం గురించివ సమాచారం అందిన వెంటనే జగ్గయ్యపే నుంచి అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలను ఆర్పేశారు. సర్పంచ్ వేల్పుల పద్మకుమారి, దేవస్థానం అధికారులు, గ్రామ ప్రజలు పెద్ద యెత్తున సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
Comments
Post a Comment