గుడుపల్లెలో 6వాలంటీర్ పోస్టులకు దరఖాస్తులకు ఆహ్వానం..!
గుడుపల్లె, త్రిశూల్ న్యూస్ :
గుడుపల్లె మండలంలో వివిధ గ్రామ పంచాయితీలలో ఖాళీగా ఉన్న వాలంటీర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని ఎంపీడీఓ జయశంకర్ ఓ ప్రకటనలో కోరారు. శెట్టిపల్లె 01, కంచిబందార్లపల్లి 02, యమగానిపల్లె 01, కొడతనపల్లె 01, సోడిగానిపల్లె 01 గ్రామపంచాయతీలలో వాలంటీర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 25 తేదీ లోపు అర్హత కలిగిన అభ్యర్థులు ప్రభుత్వ వెబ్ సైట్ నందు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. దరఖాస్తు చేసుకున్న వారికి ఈ నెల 30,31న మౌఖిక పరీక్ష నిర్వహించనున్నట్లు ఎంపీడీఓ ఓ ప్రకటనలో తెలిపారు.
Comments
Post a Comment