Trishul News

సత్యవేడులో రెచ్చిపోతున్న "లెడ్" మాఫియా అక్రమార్కులు..!

- గ్రామశివార్లలో అక్రమకార్యకలాపాలు

- పల్లెలపై కాలుష్య నీలినీడలు.. ప్రజల ఆరోగ్యంపై ప్రభావం

- మాముళ్ళ మత్తులో అక్రమార్కులకు కొమ్ము కాస్తున్న యంత్రాంగం 
సత్యవేడు, త్రిశూల్ న్యూస్ (బి.వెంకటేష్):
గ్రామీణ ప్రాంతాల శివార్లను స్థావరాలుగా మలుచుకుని లెడ్ మాఫియా అక్రమార్కులు రెచ్చిపోతున్న ఘటనలు తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గంలో నెలకొని ఉన్నాయి. ఇటీవల వరదయ్యపాళెం మండలంలోని చెంచురాజుల కండ్రిగలో ఈ లెడ్ మాఫియా ఆగడాల ఉదంతం బయటపడగా.. అదే తరహాలో సత్యవేడు మండలంలోని చెన్నేరి గ్రామంలో వెలుగుచూడగా, మరింకెక్కడెక్కడ ఇలాంటి కార్యకలాపాలు సాగుతున్నాయో తెలియాల్సి ఉంది.
తమిళనాడులోని పరిశ్రమల నుంచి వ్యర్థాలను సేకరించి వాటిని వివిధ పద్ధతుల్లో జింక్, లెడ్ ముడిసరుకుగా తయారు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ ప్రక్రియలో విడుదలవుతున్న విషవాయువులు, రసాయన జలాలను విచ్చల విడిగా వదిలేయడంతో పల్లెలపై కాలుష్య నీలి నీడలు అలుముకుంటున్నాయి. ఈ పరిస్థితుల ఇలానే కొనసాగితే ప్రజల ఆరోగ్యం పై తీవ్రస్థాయిలో ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ తరయారవుతున్న జింక్, లెడ్ ముడిసరుకును గృహోపకరణాల తయారీలో విరివిగా వాడుతుండటంతో చిన్నతరహా పరిశ్రమలకు వీటిని తరలిస్తున్న అక్రమార్కులు లక్షల్లో ఆదాయం పొందుతున్నారు.
కాగా నిషేధిత ముడిసరుకుల తయారీ కి ఎక్కడా కూడా అనుమతులు లేకపోగా తమిళతంబీలు స్థానికులతో దోస్తీ కట్టీ , వారి బలహీనతలను బలంగా మార్చుకుని పైసాల మైకంలో నింపి మరీ అక్రమ కార్యకలాపాలను ఇష్టారాజ్యంగా చేసుకుపోతున్నట్లు జగమెరిగిన సత్యం. గుట్టుచప్పుడు కాకుండా అక్రమ కార్యకలాపాలు సాగిస్తున్న వారిపై సంబంధిత అధికారులు చర్యలు శూన్యంగా మిగలడంపై సంబందించిన యంత్రాంగం మమూళ్ళ మత్తులో మునిగి విధి నిర్వాహణను మరిచిందా? అని స్థానిక ప్రజలు చర్చించుకుంటున్నారు.
అయితే రెవిన్యూ, ప్రజా ఆరోగ్య పరీరక్షణ శాఖలు ఏవీ కూడా సమాచారం ఉన్నా తనిఖీలు చేసి చర్యలు చేపట్టిన దాఖలాలు లేకపోవడం వారి నిర్లక్ష్యానికి నిలుటద్దం పడుతోంది. ఇకనైనా జిల్లా యంత్రాంగం నిద్రావస్థను వీడి సత్యవేడు నియోజకవర్గంలో కొనసాగుతున్న అక్రమార్కుల ఆగడాలను అరికట్టే దిశగా చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

Post a Comment

Previous Post Next Post