Trishul News

మన జాతీయ జెండా..!

                      రచన :- 
                డా. గొడబ మాలతి
                 తెలుగు లెక్చరర్
        డా. లంకపల్లి బుల్లయ్య కళాశాల
                    విశాఖపట్నం
                  9490824860


          🙏మన జాతీయ జెండా🙏

ప్రపంచ కీర్తి శిఖరాన త్రివర్ణ పతాకంగా రెప రెప ఎగరాలి ఎగరాలి స్వాతంత్ర జెండా మా ఐక్య జెండా..!
ఏళ్ళు నిండినా వయస్సు ముదిరినా 
నిను పెంచి నిను మోసి నీ కీర్తి నిలిపిన జాతి నాయకులు కు జేజేలు కొడుతూ...!
త్రివర్ణ పతాకంగా మన దేశ ఎర్ర కోటపై ఎగరాలి ఎగరాలి జాతీయ జెండా మూడు రంగుల జెండా ముచ్చటైనా జెండా..!

మూడు లోకాలలో మురిసి వెలిసే జెండా మా ఐక్య జెండా ఈ మూడు రంగుల జెండా ముందు తరాలకు ముచ్చటైనాజెండా..!భావితరాలకు బానిస సంకెళ్లు చేధించే ఈ జాతీయ జెండా నేటి బాలల స్వేచ్చా ఊపిరులు ఊదుతూ రేపటి పౌరులుగా పరుగులు తీస్తూ ప్రజా పాలనే స్వరాజ్యం అంటూ..!
త్రివర్ణ పతాకం గా ఎర్ర కోట పై రెప రెప ఎగరాలి ఎగరాలి మన జాతీయ జెండా ఈ మూడు రంగుల జెండా..!

భరత మాత పురిటి నొప్పులే ఆర్త నాదాలే సత్యా గ్రహాలుగా నిరాహార దీక్షలే జాతీయోద్యమ పిలుపు రాగాలుగా జాతి పిత అడుగులే మనకు స్వేచ్చా బిడ్డగా మౌంట్ బాటన్ పెట్టిన ముహుర్తంలో నెలలు నిండ కుండా స్వరాజ్యం అను నామకరణంతో అర్ద రాత్రి జన్మించిన ఈ జాతీయ జెండా ప్రజాస్వామ్యంకు నాంది పలుకుతూ...
త్రివర్ణ పతాకంగా ఎర్ర కోట పై రెప రెప ఎగరాలి ఎగరాలి మన జాతీయ జెండా.ఈ మూడు రంగుల జెండా ..!

పింగళి వెంకయ్యతో ముస్తాబు అయిన ఈ పతాకం ఖద్దరు వస్త్రం ధరియించి చేనేత కార్మికుల కర్షక కష్టం గుర్తే రాట్నం గుర్తు కాలం మారి అశోక చక్రమై ఇరవై నాలుగు గంటలు గల రోజంతా దేశ భక్తితో ఉండాలి అంటూ ఇరవై నాలుగు ఆకులు గల అశోక చక్రం మన హిందూ సంస్కృతి ధర్మం బోధిస్తూ...
త్రివర్ణ పతాకమై ఎర్ర కోట పై రెప రెప ఎగరాలి ఎగరాలి మన జాతీయ జెండా ఈ మూడు రంగుల జెండా..!

స్వాతంత్ర సమరయోధుల ఉద్యమ ఫలితం విప్లవ వీరుల ప్రాణ త్యాగమే పొరుగు వారిని పారద్రోలే భారత దేశం గౌరవం ప్రపంచాన 
నాలుగుదిక్కులా కీర్తి శిఖరాలు చేరుకుంటూ..
త్రివర్ణ పతాకమై ఎర్ర కోట పై రెప రెప ఎగరాలి ఎగరాలి మన జాతీయ జెండా ఈ మూడు రంగుల జెండా..!

భారత మాత ముద్దు బిడ్డ భగత్ సింగ్, సమర శంఖము చేత పట్టు సుభాష్ చంద్ర బోస్ విప్లవ పోరాటమే వందేమాతరమంటూ తెల్ల దొరల గుండెల్లో నిద్ర పోయి గడ గడ లాడించే అల్లూరి సీతారామరాజు ప్రాణ త్యాగమే వందనాలుగా వందేమాతరమంటూ..
త్రివర్ణమై ఎర్ర కోటపై రెప రెప ఎగరాలి ఎగరాలి మన జాతీయ జెండా ఈ మూడు రంగుల జెండా..!

భరత మాత నెత్తిన కుంకుమ దిద్దిన వీర జవానుల పోరాడే రక్త తిలకమే మన దేశ భక్తిగా అసువులు బాసిన వారి రక్త ప్రవాహమే కాషాయ వర్ణ మై హృదయ పూర్వక అశ్రువులు కార్చుతూ..
త్రివర్ణ పతాకమై ఎర్ర కోట పై రెప రెప ఎగరాలి ఎగరాలి మన జాతీయ జెండా ఈ మూడు రంగుల జెండా ..!

మూడు రంగుల్లో శ్వేత వర్ణమే శాంతి కాంక్ష గా గాంధీ మార్గమే శ్వేత వర్ణమై సత్య,అహింసలే పోరుగా శాంతి బోధన యే శాంతి కపోతం గా హృదయ భూమి లో స్వచ్ఛమైన భక్తి నింపి మన శిరస్సు ఎత్తి సెల్యూట్ కొడుతూ..
త్రివర్ణ పతాకం గా ఎర్ర కోట పై రెప రెప ఎగరాలి ఎగరాలి మన జాతీయ జెండా ఈ మూడు రంగుల జెండా..!

మనదేశ పాడి పంటల పచ్చ దనపు గర్వం ఈ హరిత వర్ణమే.. సేద్యమే దేశ సంపద పెంచు అస్త్రం కాగా హిందూ, ముస్లిం ఐక్యత కొరకు భిన్నత్వంలో ఏకత్వం మా సోదర భావం, స్నేహం వాత్సల్యం భారతీయుల అడుగు జాడల అచ్చులు దేశ ప్రగతి కాంతిగా భావితరాలకు మార్గాలై హరిత వర్ణం భారత మాత పాదాలకు పారాణి గా పులుముతూ..
భారత దేశ త్రివర్ణ పతాకమై ఎర్ర కోటపై రెప రెప లాడుతూ ఎగరాలి ఎగరాలి మన జాతీయ జెండా ఈ మూడు రంగుల జెండా..!

ఈ మువ్వన్నెల జెండా సూర్య చంద్రుల వెలుగులా వెలుతురు భూమిపై చేరునంతవరకు భారతీయుల స్వేచ్ఛ స్వాతంత్రాల శ్వాసలు తీసినంత వరకు ప్రజా పాలనకు ఈ జెండా మంత్ర దండంగా అందించిన పింగళి వెంకయ్య ఆత్మయే అమర గీతము పాడుతూ..
త్రివర్ణ పతాకంగా గా మన జాతీయ జెండా రూపకర్త కు జేజేలు పలుకుతూ ఎర్ర కోట పై ఎగరాలి ఎగరాలి జాతీయ జెండా మూడు రంగుల జెండా..!

భారత దేశ దాస్య శృంఖలాలను పటాపంచలు చేసి మంగళ హారతి అయ్యే అమర వీరుల అంతిమ యాత్రలో చివరి వస్త్రంగా వారిపై వేసి అమర నివాళులుగా వంగి ఎగిరే ఈ జాతీయ జెండా ఎగరాలి ఎగరాలి స్వాతంత్ర జెండా దేశ సైనికులు ను ఉత్సాహపరుస్తూ..
త్రివర్ణ పతాకంగాఎర్ర కోట పై ఎగరాలి ఎగరాలి మా ఐక్య జెండా ఈ మూడు రంగుల జెండా..!

ఏ దేశ మేగినా పొగడరా నీ తల్లి భూమి భారతిని అనే దేశ భక్తి గేయంలా మన జాతీయ జెండా రూపకర్త ఊహలైన ఈ మువ్వన్నె ల మూడు రంగుల జెండా కు జేజేలు పలుకుతూ..
త్రివర్ణ పతాకంగా ఎర్ర కోటపై ఎగరాలి ఎగరాలి స్వాతంత్ర జెండా మా ఐక్య జెండా జాతీయ జెండా ఈ మూడు రంగుల జెండా ముచ్చటైన జెండా మూడు లోకాలలో మురిసి వెలిసే జెండా..!

Post a Comment

Previous Post Next Post