బాధితునికి నిత్యావసర సరుకులు అందజేత..!
- నిత్యావసర సరుకులు అందజేసిన రాజంపేట జనసేన నాయకులు
సిద్ధవటం, త్రిశూల్ న్యూస్ :
రోడ్డు ప్రమాదంలో గాయాలపాలై మంచం పట్టిన బాధితుడు శ్రీరామదాసు బాలయానాది అనే బాధితుడికి రాజంపేట జనసేన పార్టి అసెంబ్లీ ఇంచార్జ్ మలిశెట్టి వెంకటరమణ సహకారంతో రాజంపేట జనసేన నాయకులు ఆదివారం నిత్యావసర సరుకులు అందజేశారు. ఈమేరకు వివరాలు ఇలా ఉన్నాయి. సిద్ధవటం మండలం ఉప్పరపల్లి గ్రామానికి చెందిన బాలయానాది తన కుమారుడుతో కలసి ద్విచక్ర వాహనంలో మాధవరం వెళుతుండగా అదుపుతప్పి ద్విచక్ర వాహనం బోల్తా పడడంతో బాలయ్య నాదికి కాలు విరిగి తీవ్ర గాయాలయ్యాయి. ఈయన చేనేత కార్మికుడు కావడంతో పనులు చేయలేక మంచానికే పరిమితమయ్యారన్నారు. సమాచారం తెలుసుకున్న రాజంపేట జనసేన నాయకులు బాలయానాదిని పరామర్శించి అతని కుటుంబానికి బియ్యము నిత్యావసర సరుకులు అంద జేశారు. ఈకార్యక్రమంలో జనసేన రాష్ట్ర చేనేత వికాస కార్యదర్శి రాటాల రామయ్య, భాస్కర్ పంతులు, వెంకటయ్య, తాళ్లపాక శంకరయ్య, వీరాచారి, జనసేన యవనాయకులు పోలిశెట్టి శ్రీనివాసులు పాల్గొన్నారు.
Comments
Post a Comment