Trishul News

నారా లోకేష్ 'యువగళం' పాదయాత్రకు లైన్ క్లియర్..!

అమరావతి, త్రిశూల్ న్యూస్ :
టిడీపీ యువ నాయకుడు నారా లోకేష్ చేపట్టబోయే పాదయాత్రకు లైన్ క్లియర్ అయింది. చాలా రోజుల నుండి ఈ పాదయాత్రపై సస్పెన్స్ నెలకొనగా తాజాగా ప్రభుత్వం పాదయాత్రకు అనుమతి ఇచ్చింది. నిబంధనలకు లోబడే పాదయాత్ర జరగాలని నారా లోకేష్, టీడీపీ క్యాడర్ కు చిత్తూరు జిల్లా ఎస్పీ రిశాంత్ సూచించారు. పాదయాత్రలో ఎక్కడా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయకూడదన్నారు. కాగా ఈనెల 27 నుంచి 'యువగళం' పేరుతో నారా లోకేష్ ఈ పాదయాత్ర చేపట్టనున్నారు.  లోకేష్ పాదయాత్రను ఆపాలనే ఉద్దేశ్యం మాకు లేదు. చట్టం ప్రకారం అందరికీ ఎలా పర్మిషన్ ఇస్తామో లోకేష్ పాదయాత్రకు అలాగే ఇచ్చాం. నిబంధనలకు లోబడే పాదయాత్ర జరపాలని ఎస్పీ సూచించారు. కాగా నారా లోకేష్ పాదయాత్రకు అనుమతి కావాలని ఇప్పటికే టీడీపీ డీజీపీకి లేఖ రాసిన విషయం తెలిసిందే. అయితే గత కొన్నిరోజులుగా పాదయాత్ర పర్మిషన్ పై సస్పెన్స్ నెలకొనగా తాజాగా సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక ఈ పాదయాత్ర 400 రోజుల పాటు 4000 వేల కిలోమీటర్ల వరకు.. అంటే కుప్పం నుంచి ఇచ్ఛాపురం వరకు నారా లోకేష్ పాదయాత్ర సాగనుంది. ఏడాది పాటు ప్రజల మధ్యే ఉండేలా లోకేష్ పాదయాత్ర రూట్ మ్యాప్ సిద్ధమైంది. నిరుద్యోగం, యువత ఎదుర్కొంటున్న సమస్యలే ప్రధాన అంశాలుగా లోకేష్ యాత్ర సాగనుంది. మహిళలు, రైతుల సమస్యల పట్ల ప్రజల్లో చైతన్యం తెచ్చేలా ప్రణాళిక రూపొందించారు. యువతను పెద్దఎత్తున భాగస్వామ్యం చేసేలా లోకేష్ పాదయాత్ర ముందుకు సాగనుంది. యువ ఓటర్లను లక్ష్యంగా చేసుకోడంలో భాగంగా యువగళం పేరుతో ప్రత్యేక జెండా కూడా రూపకల్పన చేశారు. ఈ పాదయాత్రలో మొత్తం వంద నియోజకవర్గాలు కవర్ అయ్యేలా రూట్‌ మ్యాప్‌ రెడీ చేశారు. ఆయా నియోజకవర్గాల్లో ఉన్న అన్ని వర్గాల సమస్యలు తెలుసుకోవడంతోపాటు వారి పరిష్కార మార్గాలను సూచించనున్నారు. ఈ పాదయాత్రపై తెలుగు దేశం భారీ ఆశలే పెట్టుకుంది.. పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ఉపయోగపడుతుందని.. లోకేష్ కు రాజకీయ కెరీర్ కు ఉపయోగపడుతుందంటున్నారు. నిరుద్యోగం, యువత ఎదుర్కొంటున్న సమస్యలే ప్రధాన అంశాలుగా లోకేష్ యాత్ర సాగనుంది.


నిబంధనలకు లోబడే అనుమతులు - చిత్తూరు ఎస్పీ 
నారా లోకేష్ చేపట్టనున్న పాదయాత్రకు అనుమతుల విషయంలో చిత్తూరు జిల్లా ఎస్పీ రిషాంత్ రెడ్డి స్పందించారు. 27వ తేదీ నుంచి లోకేష్ పాదయాత్ర చేపట్టనున్నారని తమకున్న సమాచారం అని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా లోకేష్ పాదయాత్రకు సంబంధించి పర్మిషన్ అడుగుతూ వర్ల రామయ్య డీజీపీకి లేఖ రాశారని గుర్తుచేశారు. దానికి డీజీపీ కార్యాలయం నుంచి సమాధానం వెళ్లిందని అన్నారు. అయితే స్థానికంగా మాజీ సీఎం చంద్రబాబు పీఏ మనోహర్, మాజీ మంత్రి అమర్‌నాథ్ రెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు పులివర్తి నానిలతో పూర్తి వివరాలు, రూట్‌ మ్యాప్‌కు సంబంధించి మాట్లాడుతున్నట్టుగా చెప్పారు. వారిని కొన్ని క్లారిఫికేషన్స్ అడగటం జరిగిందని.. అందుకు సమాధానం కూడా ఇచ్చారని తెలిపారు. దాని ఆధారంగానే వారికి పర్మిషన్ ఇవ్వడం జరుగుతుందని అన్నారు. ఎక్కడ కూడా పర్మిషన్ ఇవ్వడం లేదని చెప్పలేదని తెలిపారు. చట్టప్రకారం అందరికి ఎలా పర్మిషన్ ఇస్తామో.. లోకేష్ పాదయాత్రకు కూడా అలానే ఉంటుందని చెప్పారు. నిబంధనలకు లోబడే పాదయాత్ర అనుమతి ఉంటుందని తెలిపారు. పాదయాత్రను ఆపాలనే ఉద్దేశం కూడా తమకు లేదని తెలిపారు. అనవసరంగా కొంత దుష్ప్రచారం జరుగుతుందని అన్నారు.

Post a Comment

Previous Post Next Post