తిరుపతి జిల్లా పోలీస్ డైరీ 2023 ఆవిష్కరణ..!

తిరుపతి, త్రిశూల్ న్యూస్ :
జిల్లాల పునర్విభజనలో భాగంగా నూతనంగా ఏర్పడిన తిరుపతి జిల్లాలో మొట్టమొదటి సారిగా జిల్లా ఎస్పీ పి. పరమేశ్వర రెడ్డి సహకారంతో తిరుపతి జిల్లా పోలీసు అధికారుల సంఘం వారు పోలీసు డైరీని రూపొందించారు. పోలీస్ అతిథి గృహం సమావేశ మందిరంలో ఆవిష్కరించిన అనంతపురం రేంజ్ డీఐజీ ఎం. రవి ప్రకాష్. పోలీసు సిబ్బంది అందరికీ ఉపయోగపడే విధముగా జిల్లా సమాచారము, సెలవులు, భద్రత, ఆరోగ్య భద్రత, సర్వీసు రూల్స్, పోలీసు సిబ్బంది విధులు, అధికారాలు, ప్రవర్తన నియమావళి, ఉద్యోగ విరమణ, సర్వీసులో ఉండి మరణించిన వారి కుటుంబ సభ్యులకు రావలసిన ప్రయోజనాలు, కారుణ్య నియామకాలు, పథకాలు, స్కాలర్ షిప్ లు, పోలీసు శాలరీ ప్యాకేజ్ ప్రయోజనాలు మొదలగు విషయాలన్నీ జిల్లా ఎస్పీ గారి సూచనల మేరకు నిక్షిప్తం చేసి రూపొందించారు. కొత్తగా రూపొందించిన డైరీ నందు పోలీసుల విధులతో పాటు వారికి కావలసిన సమాచారాలన్ని స్పష్టంగా ఉన్నాయని అసోసియేషన్ వారిని డీఐజీ ప్రశంసించారు. డైరీలో ఉన్న సమాచారం మేరకు తమ నియమావళిని తెలుసుకుని సిబ్బంది అందరూ సక్రమముగా విధులు నిర్వర్తించి జిల్లాకు, పోలీసు శాఖకు మంచి పేరు తేవాలని, అదేవిధంగా తమకు రావలసిన అన్ని ప్రయోజనాలను ఉపయోగించుకోవాలని డీఐజీ గారు మరియు ఎస్పీ సిబ్బందికి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పి క్రైమ్ విమల కుమారి, వెస్ట్ డిఎస్పి నరసప్ప, యూనివర్సిటీ సీఐ రవీంద్రనాథ్, తిరుపతి జిల్లా పోలీసు అసోసియేషన్ ప్రెసిడెంట్ సోమశేఖర్ రెడ్డి, జాయింట్ సెక్రటరీ శంకర్ రెడ్డి, ట్రెజరర్ కామరాజు, సంఘ సభ్యులు మీనాక్షి, నీరజ, బేబీ కుమారి తదితరులు హాజరయ్యారు.

Comments

Popular posts from this blog

వైసీపీ ప్రభుత్వం డేటా ఎంట్రీ ఆపరేటర్లను కూడా వేదనకు గురి చేసింది - పవన్ కళ్యాణ్

కడుపు మండిన ఉద్యోగులు.. రేపు వర్సిటి బంద్ కు పిలుపు..!

ద్రావిడ ఉద్యోగుల నిరసన భగ్నానికి రిజిస్టర్ యత్నం? - ద్రావిడ ఉద్యోగులు