శ్రీకాళహస్తీశ్వర బ్రహ్మోత్సవాలకు రావాలని జగన్ మోహన్ రెడ్డికి ఆహ్వానం..!

అమరావతి, త్రిశూల్ న్యూస్ :
శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం శ్రీకాళహస్తి నందు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగు సందర్భంగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వై ఎస్ జగన్ మోహన్ రెడ్డికి, మహాశివరాత్రి బహ్మొత్సవ ఆహ్వాన పత్రికను శ్రీకాళహస్తి శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి సమక్షంలో దేవస్థాన శ్రీకాళహస్తీశ్వర పాలక మండలి చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు మరియు దేవస్థాన కార్యనిర్వహణాధికారి కె వి సాగర్ బాబు మర్యాద పూర్వకంగా అందజేశారు. అనంతరం దేవస్థాన వైదిక సిబ్బంది వారిచే స్వామి అమ్మ వార్ల శేష వస్త్రములను మరియు తీర్థప్రసాదాలను, ఆశీర్వచనముల అందించారు. ఈ సందర్భంగా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి, ముఖ్యమంత్రితో శ్రీకాళహస్తి నందలి శివం టు శివం రోడ్డును త్వరితగతిన పూర్తి చేసే విధంగా సహాయం చేయాలని అభ్యర్థన చేశారు. జగన్ వెంటనే వారి వ్యక్తిగత సహాయకులను పిలిచి త్వరితగతిన సదరు పని పూర్తి చేయాలని ఆదేశించారు. దేవస్థాన చైర్మన్ అంజూరు శ్రీనివాసరావు ముఖ్యమంత్రితో అభ్యర్థన చేస్తూ ఈ ప్రభుత్వ హయాంలో సుమారు 14 ఆలయాల కుంభాభిషేకాలు జరుగుతున్నాయని అయితే శ్రీకాళహస్తి దేవస్థాన మాస్టర్ ప్లాన్ ముందుకు సాగలేదని అందుకు త్వరితగతిన చర్యలు చేపట్టే విధంగా సహాయం చేయాలని సీఎం దృష్టికి తీసుకెళ్లడంతో వెంటనే వ్యక్తిగత సహాయకులను పిలిచి సదరు పనిని కూడా  పూర్తి అయ్యేలా చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా జగన్ కు వారు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన ధర్మకర్తల మండలి సభ్యులు నూలి జయశ్యాం మరియు దేవస్థాన పురోహితులు ఏవివిఎస్డివి ప్రసాద్ శర్మ (అర్తగిరి), స్థానిక వైసీపీ నాయకులు నరసింహులు (నంద), కంథా ఉదయ్ పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

వైసీపీ ప్రభుత్వం డేటా ఎంట్రీ ఆపరేటర్లను కూడా వేదనకు గురి చేసింది - పవన్ కళ్యాణ్

కడుపు మండిన ఉద్యోగులు.. రేపు వర్సిటి బంద్ కు పిలుపు..!

ద్రావిడ ఉద్యోగుల నిరసన భగ్నానికి రిజిస్టర్ యత్నం? - ద్రావిడ ఉద్యోగులు