పెళ్లికి పది రోజులు ఉండగా ఎయిర్ ఫోర్స్ ఉద్యోగి ఆత్మహత్య..!

ఏలూరు, త్రిశూల్ న్యూస్ :
ఏం కష్టం వచ్చిందో తెలియదు గానీ తన పెళ్లికి ఇంకా పది రోజులు మాత్రమే సమయం ఉండగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఉద్యోగి పంగిడిగూడెంలో తన ఇంట్లో ఫ్యాన్ కి ఊరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన పంగిడిగూడెంలో చోటుచేసుకుంది పంగిడిగూడెం గ్రామానికి చెందిన ఇంటి పుష్పవతి నాలుగో కుమారుడు హరీష్ బాబు (33) ఢిల్లీలో ఇండియన్ ఎయిర్ఫోర్స్ లో ఉద్యోగం చేస్తున్నాడు. హరీష్ ఇటీవల పెళ్లి కుదిరింది సంక్రాంతికి ఇంటికి వచ్చిన హరీష్ పెళ్లి పనులు చూసుకుంటున్నాడు. ఈనెల 16న వివాహం జరగాల్సి ఉండగా పెళ్లి బట్టలు కొందామని తల్లితో కలిసి ఏలూరు వెళ్లాల్సి ఉంది బట్టలు మార్చుకుని వస్తానని గదిలోకి వెళ్లి ఎంతసేపటికి బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చి తల్లి చుట్టుపక్కల వాళ్ళని పిలిచి కేకలు వేయడంతో వక్కల వాళ్ళు తలుపులు పగలగొట్టి చూడగా ఫ్యానుకు వేలాడు కనిపించాడు కిందకు దింపు చూడగా అప్పటికే హరీష్ మృతి చెందాడు. మృతుడి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ద్వారకాతిరుమల పోలీసులు.

Comments

Popular posts from this blog

వైసీపీ ప్రభుత్వం డేటా ఎంట్రీ ఆపరేటర్లను కూడా వేదనకు గురి చేసింది - పవన్ కళ్యాణ్

కడుపు మండిన ఉద్యోగులు.. రేపు వర్సిటి బంద్ కు పిలుపు..!

ద్రావిడ ఉద్యోగుల నిరసన భగ్నానికి రిజిస్టర్ యత్నం? - ద్రావిడ ఉద్యోగులు