చేతికి డబ్బిస్తేనే చితికి నిప్పు.. ఓ సుపుత్రిడి వ్యవహారం..!
- చివరికి అంత్య క్రియలు చేసిన కుమార్తె
పెనుగంచిప్రోలు, త్రిశూల్ న్యూస్ :
కాలిస్తేనే తండ్రికి తలకొరివి పెడతానని కుమారుడు భీష్మించుకుని కూర్చున్నాడు. ఆరేళ్లుగా కుమార్తె వద్దే తలదాచు కుంటున్న ఆ వృద్ధ దంపతులపై కుమారుడు కనికరం చూపకపోవ డంతో ఏర్పడ్డ ఈ దుస్థితి అందరినీ కంటతడి పెట్టించింది. మండలంలోని గుమ్మడిదుర్రులో శుక్రవారం మృతి చెందిన ఓ తండ్రికి కన్న కొడుకు ఉండి కూడా కుమార్తె తలకొరివి పెట్టడం గమనార్హం. ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు మండలం అనిగండ్లపాడుకు చెందిన వ్యక్తి కి ఆస్తి విషయంలో కొడుకుతో తరుచూ గొడవలయ్యేవి. గతంలో వ్యకికి ఉన్న భూమిని విక్రయించగా సుమారు రూ. కోటి వచ్చాయి. అందులో రూ.30 లక్షలు తన వద్ద ఉంచుకొని మిగిలిన సొమ్మును కుమారుడికి ఇచ్చాడు. ఆ సొమ్మును కూడా ఇవ్వాలని కొడుకు తండ్రితో తరచూ గొడవ పడుతుండేవాడు. ఈ నేపథ్యంలోనే ఆ వ్యక్తి అతని భార్య గత కొంతకాలంగా గుమ్మడిదుర్రులోని కుమార్తె వద్ద ఉంటున్నారు. అనారోగ్యానికి గురైన ఓ తండ్రిగా చెపుతున్నా వ్యక్తి శుక్రవారం మృతి చెందారు. తండ్రి మృతి విషయాన్ని కుటుంబ సభ్యులు కుమారుడికి చెప్పారు. తండ్రి మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లి ఖర్మ చేసేందుకు కుమారుడు నిరాకరించాడు. తండ్రి వద్ద ఉన్న డబ్బు ఇస్తేనే అంతిమసంస్కారాలు చేస్తానని భీష్మించాడు. కనీసం చూసేందుకు కూడా రాకపోవడంతో చేసేది లేక చనిపోయిన వ్యక్తి కుమార్తె కర్మకాండ పూర్తి చేశారు.
Comments
Post a Comment