గుడుపల్లెలో సచివాలయం ఉద్యోగి ఆత్మహత్యా యత్నం..!
- సంక్షేమ పథకాలపై లబ్ధిదారుల ఒత్తిడి తట్టుకోలేక అఘాయిత్యానికి పాల్పడిన వైనం
కుప్పం, త్రిశూల్ న్యూస్ :
చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం గుడుపల్లె మండల కార్యాలయంలో సచివాలయ ఉద్యోగి పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన ఘటన సోమవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే గుడుపల్లె మండలం కుప్పిగానిపల్లె గ్రామ పంచాయితీ సచివాలయం నందు పని చేస్తున్న రఘు పంచాయతీలోని ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఒత్తిడి తట్టుకోలేక.. అర్హులైన లబ్ధిదారులకు న్యాయం చేయలేక ప్రాణం తీసుకువడానికి కూడా సిద్దపడ్డాడు. ప్రభుత్వం ఇస్తున్న వివిధ సంక్షేమ పథకాలకు వయసు, కరెంట్ మీటర్ బిల్లు, కుటుంబ ఆదాయం తదితర ధ్రువీకరణ పత్రాలను కచ్చితంగా పొందుపరచాలని ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే కూలీ చేస్తే పూట గడవని పేదలకు అర్హత ఉండి కూడా ఒక్క పథకం కూడా లబ్ది చేకూరక పోవడంతో ప్రతి ఒక్కరూ సచివాలయం నందు పని చేస్తున్న రఘును నిందించడం మొదలు పెట్టారు. ప్రజల ద్వారా వచ్చే ఆరోపణలను మండల ఎంపీడీఓ దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకపోయింది. దింతో అటు ప్రజల నుండి వచ్చే నిందలు.. ఇటు ఎంపీడీఓ నిర్లక్ష్యంతో విసిగిపోయిన రఘు సోమవారం పెట్రోల్ తీసుకుని గుడుపల్లె మండల కార్యాలయం ఎదుట ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. వెంటనే చుట్టుపక్కల వారు గమనించి రఘును ఆపారు. ఇంత జరిగినా కూడా అక్కడే ఉన్న ఎంపీడీఓ 10రోజులు సెలవు తీసుకోమని చెప్పి రఘుని తల్లిదండ్రులకు అప్పచెప్పడం పలు అనుమానాలకు తావిస్తోంది. గతంలో పని చేసిన పంచాయతీ కార్యదర్శి, ప్రస్తుతం పనిచేస్తున్న పలువురు గ్రామ వాలంటీర్ల పనితీరు వల్లే రఘు చనిపోవడానికి కూడా సిద్దపడినట్లు సమాచారం. ఈ విషయంపై ఎంపీడీఓ దృష్టికి తీసుకువచ్చిన చర్యలు చేపట్టకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనం. ఏది ఏమైనా ప్రస్తుత ఎంపీపీ, జడ్పీటీసీ, ఎంపీడీఓలు ఈ విషయంపై ఎలాంటి చర్యలు చేపడతారో చూడాలి.
Comments
Post a Comment