కుక్కల దాడిలో జింక మృతి.. అంత్యక్రియలు చేసిన అధికారులు..!

కడియం, త్రిశూల్ న్యూస్ :
తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం కడియపులంకలో కుక్కల దాడిలో జింక మృతి చెందింది. గోదావరి లంకల్లో ఉండే వందలాది జింకలలో కొన్ని ఇటీవల సంభవించిన వరదలకు గల్లంతైన సంగతి తెలిసిందే. అయితే శుక్రవారం గోదావరి లంక నుంచి చెదిరిపోయి కడియపులంక ఒడ్డుకు వచ్చిన జింకపై కుక్కలు దాడి చేశాయి. గాయలైన జింక సమాచారాన్ని ఆ గ్రామ సర్పంచ్ మార్గాని అమ్మాణి ఏడుకొండలు జిల్లా ఫారెస్ట్ అధికారులకు తెలియజేశారు. దీంతో రాజమహేంద్రవరం ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ శివప్రసాద్ బీట్ ఆఫీసర్ ఆనంద్‌‌లు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే అప్పటికే జింక మృతి చెందింది. జేగురుపాడు పశుసంవర్దక శాఖ అధికారి కిరణ్, వీఆర్వో జ్యోతి తదితరులు సమక్షంలో శవ పంచనామా నిర్వహించి అంత్యక్రియలు చేపట్టారు. పూర్తిగా జింక మృతదేహం బూడిద అయ్యేవరకూ అధికారులు దగ్గరుండి దహన క్రియలు చేపట్టారు. ఈ సందర్భంగా సర్పంచ్ మార్గాని మాట్లాడుతూ జింకలకు రక్షణ కరువు అవుతుందని వరదలు వచ్చినప్పుడు లేదా కుక్కల దాడులకు మృతి చెందుతున్నాయని వీటికి సంరక్షణ చర్యలు చేపట్టాలని కోరారు. దీనిపై ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ శివ శివప్రసాద్ మాట్లాడుతూ జింకలు పకృతి ఒడిలోనే పెరగాలని ప్రత్యేక చర్యలు చేపట్టడం సాధ్యం కాదన్నారు. అయితే వరదలు వంటి విపత్కర సమయాలలో మాత్రమే వీటికి సంబంధించిన సంరక్షణ ఏర్పాట్లు చేపడతామని వివరించారు.

Comments

Popular posts from this blog

వైసీపీ ప్రభుత్వం డేటా ఎంట్రీ ఆపరేటర్లను కూడా వేదనకు గురి చేసింది - పవన్ కళ్యాణ్

కడుపు మండిన ఉద్యోగులు.. రేపు వర్సిటి బంద్ కు పిలుపు..!

ద్రావిడ ఉద్యోగుల నిరసన భగ్నానికి రిజిస్టర్ యత్నం? - ద్రావిడ ఉద్యోగులు