కబ్జా కోరల్లో గోవర్ధనపురం "పాముల" కాలువ..!
- ప్రభుత్వ భూములే టార్గేట్.. అధికార పార్టీ నాయకుల ఆగడాలు
-మౌనం దాల్చిన అధికార యంత్రాంగం.. అయోమయంలో వైకాపా కీలక నేతలు*
- వరదయ్యపాళెం మండల కేంద్రంలో ఇదీ సంగతీ
వరదయ్యపాలెం, త్రిశూల్ న్యూస్ :
తిరుపతి జిల్లా వరదయ్యపాళెం మండల కేంద్రంలో జిల్లా అధికార యంత్రాంగం పర్యవేక్షణ శూన్యంగా మారిన తరుణం లో స్థానిక అధికార పార్టీ నాయకుల ఆగడాలకు.. మండల అధికారులు మౌనం దాల్చిన సంగతీ చర్ఛనీయాంశంగా మారింది.
అసలు విషయానికి వస్తే..
అధికార పార్టీలో కీలక పాత్ర పోషిస్తున్న వారే అక్రమార్కులకు అండగా నిలవడంతో పగలు మాకు తెలీదు.. రాత్రీ మీ ఇష్టం అన్నట్టుగా వ్యవహరిస్తున్నారా అంటే..?అవునని చెప్పకతప్పడంలేదు. సొమ్మల సోకులో పడి అమ్ముడు పోతున్నారా? అనే తీరుగా పరిస్థితులు చోటు చేసుకొంటున్నాయి అంటే .. ఏ రీతిలో పరిస్థితులు మారుతున్నాయో ఆలోచించాల్సిన అవసరం లేకుండా పోలేదని స్వపక్ష, విపక్ష అసమ్మతి నాయకులు బహిరంగంగా మాట్లాడుకుంటున్నారు. ఏవరికివారే.. తమని నమ్ముకున్న వారికి నచ్చచెపుతూ ఉండటం గమనార్హంగా ఉండగా? వారికి వారే.. తమకు తామే సరిచేసుకుంటున్నామని, సరిదిద్దుకుంటున్నామన్న విచిత్రపరిస్థితులు కల్పిస్తూ హాస్యాస్పద వాతావరణాన్ని సృస్టిస్తున్నారు. వరదయ్యపాళెం మేజర్ పంచాయితీలోని గోవర్ధనపురం పాముల కాలువ గట్టు వర్షాల తాకిడి ఎక్కువైతే వరద ఉధృతికి కొట్టుకుపోయే పరిస్థితి ఉన్నప్పటికీ.. ఇక్కడి కాలువ గట్టున దుకాణాల ఏర్పాటుకు ఓ పెద్ధనేత.. పెద్ధ మొత్తంలో లావీదేవీలు జరపడం కారణంగా నిన్న శనివారం స్థానిక పోలీస్టేషన్ లో సంబంధిత అధికారులు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడం శోఛనీయం. అయితే ఈ కాలువ గట్టు కబ్జాల వ్యవహారంపై గతంలోనూ వార్తా కథనాలు వచ్చినప్పటికి అధికారుల నుంచి స్పందన పగటికే పరిమితకావడంతో రాత్రివేళ అక్రమ కట్టడాలు సాగిస్తున్నారు. అధికారులకు తెలియకనో తెలిసో మరీ చేతివాటానికి అలవాటు పడో చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారా అనేటువంటి విమర్శలు తలెత్తుతున్నాయి.
అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఆ పెద్ధనేత కనుసన్నల్లో నడవాలని ప్రభుత్వ భూములను కబ్జాలు చేస్తూ.. ప్రశ్నించే సామాన్య స్వర్ణసాగర స్వరాలపై దాడులు చేయడం ఎంత వరకు సమంజసమో ఆలోచించాల్సిన అవసరం ఉన్నా.. అధికార బలం మాటున అధికారుల గొంతు మూగబోయిందనేది వాస్తవం. ఇక్కడ అధికార పార్టీలో ఓ పెద్ధ అనాలోచిత ఆలోచనలకు ప్రతిభావంతులు కూడా కులం ముసుగులో కుమ్ములాడుకోవడం విధితమే అయినా.. మాకేం లేదు మాకసలు సంబంధం లేదు అనేతీరుగా నల్లతోలు కప్పుకున్న తెల్లవారిగా విభజించు.. పాలించు అనేరకంగా దోబుచులాటలో దోషులు అవుతున్నారనే విషయం గ్రహించకనే పాపాల పుట్టలో పాలు పోస్తూ అవివేకులౌతున్నారని స్థానిక ప్రజా ప్రతినిధుల నుంచి వారి వారి కుటుంబ సభ్యుల వరకూ అపై అనుచర ప్రజానీకం సైతం మాట్లాడుకుంటూ ఉండటం గమనార్హం. ఇకపోతే కార్యాలయాలాన్నే అడ్డగా మార్చుకుని దళారీ వ్యవస్థ నడుస్తుందా.. అనే వైనంగా స్థానిక పోలీస్ శాఖ కార్యాలయ నిర్వాహణ సాగుతోందని విమర్శుకులు ఆరోపిస్తున్నారు. ఇకనైనా జిల్లా ఉన్నత అధికారులు స్పందించి భూ కబ్జాలను అరికట్టాలని, ప్రభుత్వ శాఖల్లో నెలకొంటున్న నీలినీడలను పారద్రోలి విలువైన సేవలను అందించాలని ప్రజలు కోరుతున్నారు.
Comments
Post a Comment