వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేర్చాలని టిఎస్ అసెంబ్లీలో తీర్మానం..!

హైదరాబాద్, త్రిశూల్ న్యూస్ :
వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేర్చాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. ఈ మేరకు తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేశారు. సీఎం కేసీఆర్ తీర్మానాన్ని ప్రతిపాదించగా అసెంబ్లీ ఏకగ్రీవంగా అమోదించింది. వాల్మీకి బోయలతో పాటు బేదర, కిరాతక, నిషాది, పెద్ద బోయ, బాట్‌ మదురాలు, చామర్ మదురాలను ఎస్టీలో చేర్చాలని గతంలో కేంద్రానికి లేఖ రాశామని సీఎం గుర్తు చేశారు. కేంద్రానికి మరోసారి లేఖ రాస్తామన్నారు. ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలోని మాలి వర్గాన్ని కూడా ఎస్టీ జాబితాలో కలపాలని సీఎం కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఆసిఫాబాద్ తో పాటు ఆదివాసీ జిల్లాల్లో నివసిస్తున్న మాదిగలను కూడా ఎస్టీల్లో చేర్చాలన్న ప్రతిపాదనలు పరిశీలిస్తామన్నారు. వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేర్చాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి, ఎక్సైజ్‌, క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ కేంద్రాన్ని డిమాండ్‌ చేశారు. వాల్మీకి బోయలను కొన్ని రాష్ట్రాలు ఎస్టీ, ఎస్సీ జాబితాలో చేర్చాయని వివరించారు. వాల్మీకి బోయలు ఎస్టీ జాబితాలో చేర్చాలని 1956 నుంచి ఉద్యమాలు చేస్తున్నారని అన్నారు. చెల్లప్ప కమీషన్ రిపోర్ట్ ఆధారంగా వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేర్చాలని సభలో ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపామని తెలిపారు. తెలంగాణ తీర్మానాన్నికేంద్ర ప్రభుత్వం వెంటనే ఆమోదించి బోయలకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.

Comments

Popular posts from this blog

వైసీపీ ప్రభుత్వం డేటా ఎంట్రీ ఆపరేటర్లను కూడా వేదనకు గురి చేసింది - పవన్ కళ్యాణ్

కడుపు మండిన ఉద్యోగులు.. రేపు వర్సిటి బంద్ కు పిలుపు..!

ద్రావిడ ఉద్యోగుల నిరసన భగ్నానికి రిజిస్టర్ యత్నం? - ద్రావిడ ఉద్యోగులు