ఇళ్ల నిర్మాణం కోసం ఏపీకి కేంద్రం రూ.20 వేల కోట్లిచ్చింది - పురందేశ్వరి

విజయవాడ, త్రిశూల్ న్యూస్ :
రాష్ట్రంలో రహదారుల దుస్థితేంటో ప్రజలను అడిగితే తెలుస్తుందని ఏపీ భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి విమర్శించారు. భాజపా రాష్ట్ర అధ్యక్షురాలిగా ఆమె విజయవాడలోని పార్టీ కార్యాలయంలో గురువారం బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు స్వీకరణ తర్వాత తొలిసారి మీడియాతో పురందేశ్వరి మాట్లాడుతూ.. ఇళ్ల నిర్మాణానికి 9 ఏళ్లలో రాష్ట్రానికి కేంద్రం రూ.20 వేల కోట్లు ఇచ్చింది.. రాష్ట్రంలో ఇప్పటికే 65 శాతం ఇళ్ల నిర్మాణాలు పూర్తయి ఉండాలి.. కానీ 35 శాతం కూడా పూర్తి కాలేదనేదన్నారు. ఈ విషయంలో పేదలకు వైకాపా ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుందని ప్రశ్నించారు. రాష్ట్రంలో రహదారుల దుస్థితేంటో ప్రజలను అడిగితే తెలుస్తుందని.. ఏపీలో పెట్టుబడులకు ఎవరూ ముందుకు రాని పరిస్థితి ఏర్పడింది.. ఉన్న పరిశ్రమలూ తరలిపోతున్నాయి అని విమర్శించారు.

ఎన్టీఆర్‌ ఘాట్‌కు వెళ్లి ఘన నివాళులు..
విజయవాడలో బాధ్యతలు స్వీకరణ కంటే ముందు.. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్‌ను పురందేశ్వరి సందర్శించారు. తండ్రి ఎన్టీఆర్‌ సమాధి వద్ద తన నియామక పత్రాన్ని ఉంచి పుష్పాంజలి ఘటించారు. ఆ తర్వాత గన్నవరం చేరుకున్న ఆమెకు కార్యకర్తలు భారీ గజమాలతో స్వాగతం పలికారు. ఆపై భారీ వాహన ప్రదర్శనతో విజయవాడకు వచ్చి అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టారు. పురందేశ్వరి వెంట ఏపీ భాజపా మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజు, నేతలు సత్యకుమార్‌, కిరణ్‌ కుమార్‌ రెడ్డి ఉన్నారు.

Comments

Popular posts from this blog

వైసీపీ ప్రభుత్వం డేటా ఎంట్రీ ఆపరేటర్లను కూడా వేదనకు గురి చేసింది - పవన్ కళ్యాణ్

కడుపు మండిన ఉద్యోగులు.. రేపు వర్సిటి బంద్ కు పిలుపు..!

ద్రావిడ ఉద్యోగుల నిరసన భగ్నానికి రిజిస్టర్ యత్నం? - ద్రావిడ ఉద్యోగులు