చంద్రయాన్ - 3 ప్రయోగానికి కౌంట్ డౌన్ ప్రారంభించిన ఇస్రో..!

శ్రీహరికోట, త్రిశూల్ న్యూస్ :
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ చంద్రుని చెంతకు చేరడం కోసం చంద్రునిపై కూడా భారత జాతీయ జండాను నిలిపి ప్రపంచదేశాలకు దీటుగా నిలవడం కోసం సర్వం సిద్ధం చేసింది. రేపు జరిగే చంద్రయాన్ - 3 ప్రయోగంతో సరికొత్త అధ్యనానికి శ్రీకారం చుట్టబోతుంది.
ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ నుండి రేపు మధ్యాహ్నం 2 గంటల 35 నిమిషాలకు ఇస్రో LVM3 /M4 రాకెట్ ద్వారా చంద్రయాన్ - 3 ప్రయోగాన్ని చేపట్టనుంది. ఈ ప్రయోగానికి సంబందించిన కౌంట్ డౌన్ కూడా గురువారం మధ్యాహ్నం 1 :05 గంటకు ప్రారంభించడం జరిగింది. 25 గంటల 30 నిమిషాల పాటు ఈ కౌంట్ డౌన్ కొనసాగిన అనంతరం ప్రయోగం జరుగుతుంది. ఇప్పటికే ప్రయోగ విజయం కోసం ఇస్రో చైర్మన్ సోమనాధ్ నేతృత్వంలో శాస్త్రవేత్తలు శ్రమిస్తున్నారు. ప్రపంచ దేశాల అంతరిక్ష పరిశోధన సంస్థలు ఇస్రో వైపు చూస్తుంటే ఇస్రో మాత్రం చంద్రుని చెంతకు చేరడమే లక్షంగా పెట్టుకుని పనిచేస్తుంది. చంద్రయాన్ -1 మరియు చంద్రయాన్-2 ప్రయోగాల ద్వారా చంద్రుని పైన నీటి జాడలను ఇస్రో స్పష్టంగా గుర్తించడం జరిగింది. ఇదే స్ఫూర్తితో 
ఇంకా చంద్రునిపై దాగి ఉన్న రహస్యాలను ఛేదించడానికి సరికొత్త సాంకేతిక పరికరాలను అమర్చిన చంద్రయాన్ -3 ని సిద్ధం చేసి ఇస్రో చంద్రుని పైకి పంపుతుంది. కౌంట్ డౌన్ సమయం కొనసాగుతున్న నేపథ్యంలో రాకెట్ ప్రయాణానికి కావలసిన ద్రవ ఇంధనాలను, గ్యాస్ ను రాకెట్ లో నింపే ప్రక్రియను నిర్వహిస్తున్నారు. రాకెట్ ప్రయోగం జరిగిన తరువాత 16 నిమిషాలకు చంద్రయాన్ - 3 రాకెట్ చివరి భాగంలోని క్రయోజనిక్ 
నుండి విడిపోయి అంతరిక్షంలో ప్రయాణాన్ని కొనసాగిస్తుంది. ఇలాగే 42 రోజుల పాటు 
చంద్రయాన్ - 3 ప్రయాణిస్తూనే ఉంటుంది. అంటే ఆగస్టు 20 వ తేదీ తరువాత చంద్రయాన్ -3 చంద్రునిపైన ల్యాండ్ అవుతుంది. 

ఆ మూడు కీలక పరికరాలు..!

LVM 3 - M4 రాకెట్ ద్వారా ప్రయోగిస్తున్న చంద్రయాన్ - 3 లో ఉన్నవి మూడు కీలకమైన పరికరాలు, మొదటిది మాడ్యూల్ అయితే రెండవది ల్యాండర్ మూడవది రోవర్ అని చెప్పాలి. చంద్రునిపై పరిశోధనకు ఇవే కీలక పాత్ర పోషించనున్నాయి.

మాడ్యూల్ అంటే :- రాకెట్ పై భాగంలో ఈ మాడ్యూల్ ఉంటుంది డేకి పైన ల్యాండర్ అందులో రోవర్ ఉంటాయి. మాడ్యూల్ ప్రధానంగా ల్యాండర్, రోవర్ లను చంద్రుని దగ్గరకు చేర్చే పరికరంగా చెప్పాలి. భూమి నుండి చంద్రుని వరకు తీసుకువెళ్లి చంద్రుని చుట్టూ 
తిరుగుతూ ల్యాండర్ ను వాడాల్సిన చోట వదులుతుంది.

ల్యాండర్ అంటే :- చంద్రునికి సమీపంలో మాడ్యులు నుండి ల్యాండర్ విడిపోయిన తరువాత దాంతో పాటు ఉన్న రోవర్ తో సహా మెల్లగా ల్యాండర్ చంద్రుని పైకి దిగుతుంది. చంద్రుని పైకి ల్యాండ్ కావడం ల్యాండర్ పని.

రోవర్ అంటే :- రోవర్ అంటే చంద్రుని పైకి ల్యాండర్ చేరిన తరువాత అందులో నుండి చంద్రుని పైకి దిగి పరిశోధనలు చేసే యంత్రం అని చెప్పాలి.. ఇక్కడ ల్యాండర్ కు, రోవర్ కు ప్రత్యేక కెమెరాలు అమర్చి ఉంటాయి. ల్యాండర్ కు ఉన్న కెమెరాల ద్వారా 
రోవర్ చేస్తున్న పరిశోధనలను, కదలికలను ఇస్రో శాస్త్రవేత్తలు అంచనాలు వేస్తుంటారు. అలాగే రోవర్ కు ఉన్న కెమెరా ద్వారా ల్యాండర్ ను గమనిస్తూ ఉంటారు. ఈ విదంగా చంద్రుని పై పరిశోధనలు కొనసాగబోతున్నాయి.
చంద్రునికి వెనకే మన పరిశోధనలు..!
భూమికి కనిపించే చంద్రుడు ఒక వైపు మాత్రమే.. మనకు కనిపించని చంద్రుని వెనక వైపు 
మన చంద్రయాన్ - 3 పరిశోధనలు జరగబోతున్నాయి. ఇప్పటి వరకు ప్రపంచదేశాలలో ఎవ్వరు చేయని సాహసం మన ఇస్రో చేయబోతుంది.

Comments

Popular posts from this blog

వైసీపీ ప్రభుత్వం డేటా ఎంట్రీ ఆపరేటర్లను కూడా వేదనకు గురి చేసింది - పవన్ కళ్యాణ్

కడుపు మండిన ఉద్యోగులు.. రేపు వర్సిటి బంద్ కు పిలుపు..!

ద్రావిడ ఉద్యోగుల నిరసన భగ్నానికి రిజిస్టర్ యత్నం? - ద్రావిడ ఉద్యోగులు