ఆడికృత్తిక బ్రహ్మోత్సవాలకు వేలంపాట ద్వారా రూ. 7.87లక్షలు ఆదాయం..!
గుడుపల్లె, త్రిశూల్ న్యూస్ :
చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం
గుడుపల్లె మండలం చిన్నగొల్లపల్లె గ్రామపంచాయతీ పశ్చిమవాహిని గుడివంకలోని వేపమానుకొండలో నెలకొని ఉన్న శ్రీ వళ్ళీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యం స్వామి ఆడికృత్తిక బ్రహ్మోత్సవాలకు నిర్వహించిన వేలం పాట ద్వారా రూ. 7,87000లు ఆదాయం వచ్చింది. బుధవారం ఆలయ ప్రాంగణంలో చేర్మెన్ ఎన్. సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో కార్యనిర్వహణాధికారి వై. వి. చలపతి వేలంపాట నిర్వహించారు. ఈ వేలం పాటులో లడ్డు విక్రయానికి రూ.4.50లక్షలు, తలనీలాలకు రూ. 2. 72లక్షల, ఆంగుళ్ళుకు రూ. 65వేలు ఆలయానికి ఆదాయం వచ్చింది. ఆగస్టు 3వ తేది నుండి 9వ తేది వరకు ఆడికృత్తిక బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నట్ల ఆలయ నిర్వాహకులు తెలిపారు. ఈ నెల 17నుండి ఆడినెల ప్రారంభం నుండి శ్రీ వళ్ళీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యం స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు ఆలయ చేర్మెన్ తెలిపారు. కాగా గత సంవత్సరం జరిగిన వేలం పాట కంటే ఈ ఏట జరిగిన వేలం ద్వారా రూ.88.500 ఎక్కువ ఆదాయం వచ్చింది. గత ఏడాది వేలం ద్వారా రూ. 6,98500లు వచ్చింది. ఈ వేలం పాటులో ఆంగుళ్ళుకు రూ.46,500, లడ్డు విక్రయానికి రూ.4.70లక్షలు, తలనీలాలకు రూ.1.82లక్షల వచ్చింది. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యులు కృష్ణమూర్తి, వైసిపి మండల కో కన్వీనర్, రామ్మూర్తి, వైస్సార్సీపీ నాయకులు వి.వెంకటేష్, ఆర్. వి. వెంకటాచలం, ఆనంద్, సింగల్ విండో చేర్మెన్ క్రిష్ణమూర్తి, వెంకటస్వామి, ధర్మకర్త నారాయణయప్ప, ఆలయ కమిటి సభ్యులు, చిన్నగొల్లపల్లె గ్రామపంచాయతీ పెద్దలు, వేలం పాటదారులు పాల్గొన్నారు.
Comments
Post a Comment