ఏపీలో తొమ్మిది నెలల్లో ఎన్నికలు జరిగే అవకాశం..!
అమరావతి, త్రిశూల్ న్యూస్ :
2024 ఏప్రిల్ లేదా మే మాసాల్లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయని ఆయాజిల్లాల సమస్యలు వాటి పరిష్కారానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలో మంత్రులను జగన్ ఆదేశించారు.బుథవారం కేబినెట్ సమావేశం అనంతరం గడపగడపకు మన ప్రభుత్వం జగనన్నసురక్ష కార్యక్రమాలపై మత్రుల పర్యవేక్షణ ఉండాలన్నారు.
ఇప్పటికే రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం నెలకొంది. జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర నిర్వహిస్తున్నారు. రెండో విడత యాత్ర ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాలో సాగుతుంది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువ గళం పేరుతో పాదయాత్ర నిర్వహిస్తున్నారు. మరో వైపు వైసీపీ కూడ ఎన్నికలకు సిద్దమౌతుంది.వైసీపీకి చెందిన రీజినల్ కో ఆర్ఢినేటర్లు ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితులపై సమీక్షలు నిర్వహిస్తున్నారు. మరో వైపు ఇంచార్జీలు లేని సెగ్మెంట్లకు టీడీపీ చీఫ్ చంద్రబాబు ఇంచార్జీలను నియమిస్తున్నారు.ఆంధ్రప్రదేశ్ లో కూడ ఎన్నికలకు బీజేపీ సన్నద్దమౌతుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న సోము వీర్రాజును తప్పించి ఆయన స్థానంలో పురంధేశ్వరిని నియమించింది. వచ్చే ఎన్నికల్లో విపక్ష పార్టీలు కూటమిగా పోటీ చేసే అవకాశం ఉందనే సంకేతాలు ఇస్తున్నాయి. అయితే ఈ కూటమిలో టీడీపీ,జనసేలు ఉండే అవకాశం ఉందనే రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉంటే వైసీపీ మాత్రం ఒంటరిగానే పోటీ చేస్తుంది.ఈ విషయాన్ని సీఎం జగన్ స్వయంగా ప్రకటించారు. గత ఎన్నికల్లో వచ్చిన సీట్ల కంటే ఎక్కువ సీట్లను దక్కించుకోవాలని ఆ పార్టీ పట్టుదలతో ఉంది.
Comments
Post a Comment