కుప్పం సరే మరి పుంగునూరులోని దొంగ ఓట్లపై పెద్దరెడ్డి సమాధానం చెప్పాలి - ఎమ్మెల్సి కంచర్ల శ్రీకాంత్

- బూతు స్థాయి ఉద్యోగులు అధికార పార్టీకి తొత్తులు కావద్దు

- విలేకరుల సమావేశంలో తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్
కుప్పం, త్రిశూల్ న్యూస్ :
కుప్పం నియోజకవర్గంలో దొంగ ఓటర్లు ఉన్నారంటూ పదే పదే ఆరోపిస్తున్న వైసిపి నేతలకు పుంగనూరులో ఉన్న దొంగ ఓటర్ల సంగతి ఏమిటని తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్
ప్రశ్నించారు. ఓటర్ల జాబితా పరిశీలనపై కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ సమన్వయ కమిటీ అధ్యక్షులు పాత్రికేయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసిపి నాయకులు, రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చిత్తూరు జిల్లా ఎమ్మెల్సీ భరత్ నిర్వహించే సభా సమావేశాలలో కుప్పం శాసనసభ్యులుగా నారా చంద్రబాబు నాయుడు దొంగ ఓట్లతో గెలిచారంటూ ఆరోపించడంపై మండిపడ్డారు.  ఎన్నికలు దగ్గర పడడంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ అధికారులు ఓటర్ల జాబితా పరిశీలన కార్యక్రమం చేపట్టారన్నారు. ఈ కార్యక్రమంలో ఇప్పటికే ఓటర్ల జాబితాలో రెండు లక్షలకు పైచిలుకు ఇంటి నెంబర్లు లేని గృహాలను గుర్తించడం జరిగిందన్నారు. అందులో ఒక్క పుంగునూరు నియోజకవర్గంలోనే సుమారు రెండు వేలకు పైగా డోర్ నెంబర్లు లేని ఇళ్లను గుర్తించినట్టు తెలిపారు. కుప్పం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తరఫున ఓటరు జాబితాను పరిశీలించి సుమారు 12 వేలకు పైచిలుకు ఓటర్లను తొలగించాలని సూచించామన్నారు. అందులో మరణించిన వారు, కుప్పం వదిలి వెళ్లినవారు ఉన్నట్టు తెలిపారు. కానీ వైసీపీ నాయకులు ఇప్పటికీ 30,000 మంది దొంగ ఓటర్లు ఉన్నట్టు ప్రచారం చేస్తూ టిడిపి సానుభూతి పరులను ఓటర్ల జాబితా నుండి తొలగించడానికి ప్రయత్నం చేస్తున్నట్టు అనుమానం వ్యక్తం చేశారు. కావున బూతు స్థాయి ప్రభుత్వ ఉద్యోగులు ఓటర్ల జాబితా పరిశీలనలో తగిన జాగ్రత్తలు పాటించాలని, ముఖ్యంగా ఎన్నికల సంఘం సూచనల మేరకు ఓటర్ల జాబితా పరిశీలనకు వాలంటరీలను ఉపయోగించరాదని అన్నారు. అలాగే ద్రవిడ కూడలిలోని కుప్పం నియోజకవర్గంలో నివాసం ఉంటూ బతుకుదెరువు కోసం బెంగళూరు నగరానికి ప్రతినిత్యం రాకపోకలు సాగించే వారితో పాటు వారమంతా బెంగళూరులో పనిచేసే వారానికి ఒక్కసారి సొంత ఊరికి వచ్చేవారు ఎక్కువగా ఉన్నారని, అలాంటి వారిని గుర్తించి ఓటరు జాబితాలో వారి పేర్లను ఓటరు జాబితాలో కొనసాగించాలని సూచించారు. అధికారులు ఓటరు జాబితా పరిశీలనలో జాగ్రత్తలు పాటించకుండా అధికార పార్టీకి అనుకూలంగా పనిచేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. అలాంటి అధికారులపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడంతో పాటు అవసరమైతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక టిడిపి నాయకులు త్రిలోక్ నాయుడు, బాబు నాయుడు, సత్యేంద్ర శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

వైసీపీ ప్రభుత్వం డేటా ఎంట్రీ ఆపరేటర్లను కూడా వేదనకు గురి చేసింది - పవన్ కళ్యాణ్

కడుపు మండిన ఉద్యోగులు.. రేపు వర్సిటి బంద్ కు పిలుపు..!

ద్రావిడ ఉద్యోగుల నిరసన భగ్నానికి రిజిస్టర్ యత్నం? - ద్రావిడ ఉద్యోగులు